పారిశుద్ధ్య పనులు పర్యవేక్షణ చేస్తూ..

పారిశుద్ధ్య పనులు పర్యవేక్షణ చేస్తూ..

కుంటాల, ఆంధ్రప్రభ : ఫిబ్రవరి మండలంలోని అంబకంటి గ్రామంలో సోమవారం పలు వీధులలో స్థానిక సర్పంచ్ ముజ్జిగే రాణి ప్రవీణ్ వీధులను పరిశీలన చేస్తూ పారిశుద్ధ్య కార్మికుల పని తీరును ఆయన పర్యవేక్షణ చేశారు. ఈ సందర్భంగా ప్రతి వీధులలో రోజువారిగా చెత్త సేకరణను చేపట్టాలని పారిశుద్ధ్య కార్మికులకు సూచించారు. అదే విధంగా మురికి కాలువలు ఎప్పటికప్పుడు శుభ్రపరచాలని ప్రతి కాలనీలో చెత్తా చదరం లేకుండా చేపట్టాలని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా రాణి మాట్లాడుతూ.. పారిశుద్ధం పై గ్రామం పై ప్రత్యేక దృష్టి పెడుతున్నారని రోజువారీగా ట్రాక్టర్ ద్వారా పరిశుద్ధ్య పనుల పై పరిశీలన చేస్తూ వీధులలో తిరుగుతున్నానని తెలియచేశారు. అదే విధంగా గ్రామ అభివృద్ధి తన లక్ష్యమని.. ప్రభుత్వం ద్వారా వచ్చే నిధులను గ్రామ అభివృద్ధికి పూర్తి స్థాయిలో అందించి అభివృద్ధికి సహకరిస్తానని తెలిపారు.

Leave a Reply