జీవితం కోసం ‘సూపర్’ ఆదా

హిందూపురం , అక్టోబర్ 9 (ఆంధ్రప్రభ) : ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna ) ఆదేశాల మేరకు హిందూపురం పట్టణంలో స్థానిక ప్రభుత్వ హాస్పిటల్ నందు హాస్పిటల్ సూపరిండెంట్ డాక్టర్ అన్నపూర్ణ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ కార్యక్రమంలో మునిసిపల్ చైర్ పర్సన్ డీఈ రమేష్ కుమార్, ఎమ్మెల్యే వ్యక్తిగత కార్యదర్శి వీరయ్య పాల్గొన్నారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఈ సూపర్ జీఎస్టీ (Super GST) ప్రజల ఆరోగ్యానికి పెద్ద ఊరట, ఆరోగ్యం, జీవితం కోసం సూపర్ ఆదా అని పేర్కొన్నారు. భారత ప్రభుత్వం జీఎస్టీ 2.0 సంస్కరణలు తీసుకొచ్చింది 2017 లో జీఎస్టీ వచ్చినప్పటి నుండి ఇది ప్రజలకు నేరుగా లాభం చేకూర్చే పెద్ద మార్పు దీని ఉద్దేశం మందుల ధరలు తగ్గించడం, ఆరోగ్య సేవలు చవకగా చేయడం, ప్రతి కుటుంబం భీమా సౌకర్యం పొందేలా చేయడం, ఈ జీఎస్టీ 2.0 సంస్కరణల వల్ల ప్రాణ రక్షక మందుల ధరలు తగ్గుతాయన్నారు. ఆరోగ్య, జీవిత బీమా తీసుకోవడం సులభం అవుతుంది అని తెలిపారు. ఆస్పత్రులు, ల్యాబ్ లు, పరికరాలు చౌకగా తెచ్చుకోగలమన్నారు.

సాధారణ మందులు, టెస్టింగ్ కిట్లు (Testing kits), ఔషధ తయారీ, బయో మెడికల్ వ్యర్థాల శుద్ధి, డ్రై ఫ్రూట్స్, డయాబెటిక్ ఫుడ్స్, కంటి ఆపరేషన్ పరికరాలు, వైద్య పరికరాలు పైన 12% నుండి 5% వరకు తగ్గింపు, 36 ప్రాణ రక్షక మందులపై పూర్తిగా జీఎస్టీ రద్దు, బీమాపై పన్ను పూర్తిగా రద్దు, జీవిత ఆరోగ్య బీమాపై జీఎస్టీ పూర్తిగా రద్దు అంటే ప్రతి పాలసీపై నేరుగా 18% ఆదా అవుతుందన్నారు. దీని వలన ఆరోగ్య రంగంలో పన్ను విధానం సులభతరం అవుతుందన్నారు.

ఔషధ పరీక్ష రంగాల వ్యయాలు తగ్గుతాయి. దేశీయ ఉత్పత్తి (Domestic production) కి ప్రోత్సాహం లభిస్తుంది అని తెలిపారు. వినియోగదారులకు ధరల్లో తగ్గింపు స్పష్టంగా కనిపిస్తుంది అని వ్యాపారాలకు ప్రజలకు లాభదాయకమైన పన్ను వ్యవస్థ ఏర్పడుతుంది అని తెలిపారు. జిఎస్టి 2.0 సంస్కరణలు వలన ప్రతి కుటుంబానికి ఆరోగ్యం, భద్రత, ఆదా అనే మూడు లాభాలు తీస్తున్నాయని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డ్రగ్ ఇన్స్ పెక్టర్ మాధవి, ఆరోగ్యశ్రీ కోఆర్డినేటర్ శ్రీదేవి, వడ్డే కార్పోరేషన్ డైరెక్టర్ శ్రీదేవి, సి ఎస్ ఆర్ ఎమ్ ఓ లక్ష్మీ రామ్ నాయక్, సింగల్ విండో డైరెక్టర్ చెన్నమ్మ, డ్రగ్ అండ్ కెమిస్ట్ అసోసియేషన్ సిబ్బంది, హాస్పిటల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply