Sujana Chowdary | వితరణ..

Sujana Chowdary | వితరణ..
Sujana Chowdary, భవానిపురం, ఆంధ్రప్రభ : ఈ నెల 28వ తేదీన పశ్చిమ నియోజకవర్గ పరిధిలోని కుమ్మరిపాలెం ఈద్గా గ్రౌండ్స్ లో జరగనున్న దావత్ ఏ ఇస్లామి ఇండియా ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఏక్ దిన్ కా సున్నతోన్ భరా ఇజిమా కార్యక్రమం జరగనుంది. కార్యక్రమ నిర్వాహకులు ఎస్ కె. హామీద్, మహమ్మద్ జహంగీర్ భాషా, సయ్యద్ ఇర్షాద్, ఎస్ కే. షరీఫ్ ఎమ్మెల్యే సుజనాచౌదరిని కలిసి ఈ కార్యక్రమ నిర్వహణకు సహాకరించాల్సిందిగా కోరారు. ఎమ్మెల్యే వెంటనే స్పందించి రూ.25 వేలను తన సొంత నిధుల నుండి ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి పత్తిపాటి శ్రీధర్ ద్వారా నిర్వాహకులకు అందచేశారు.
