శ్రీ సత్యసాయి జిల్లా : ఓరువాయి వీఆర్ఏ రంగస్వామి తన వ్యక్తిగత భూమి సంబంధిత వివాదంతో నల్లచెరువు తహశీల్దార్ కార్యాలయంలో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశారు.
రంగస్వామి తనకు చెందిన 15సెంట్ల భూమిని ఇతరుల పాస్ పుస్తకాల్లో నమోదు చేసినట్లు తహశీల్దార్ రవికుమార్, వీఆర్వో నిర్మల పై తీవ్ర ఆరోపణలు చేశారు. అయితే దీనిపై తీవ్ర మనస్థాపానికి గురైన వీఆర్ఏ రంగస్వామి చేసేదేమీ లేక తహసీల్దార్ కార్యాలయంలోనే ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.