Suicide | ఎందుకంటే…

Suicide | ఎందుకంటే…
Suicide | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : చీఫ్ ఇంజనీర్ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ కింద పడి బలవన్మరణానికి పాల్పడిన విషాద ఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నం జిల్లా దువ్వాడ రైల్వేస్టేషన్‌లో చోటుచేసుకుంది. ఓ ప్రైవేటు కంపెనీలో చీఫ్ ఇంజినీర్‌గా పని చేస్తున్న హర్షవర్ధన్ (36).. విజయవాడ వైపు వెళ్తున్న జన్మభూమి ఎక్స్‌ప్రెస్ కింద పడి ఆత్మహత్య చేసుకున్నారు.
కుటుంబ కలహాలే ఈ ఘటనకు కారణంగా తెలుస్తోంది. హర్షవర్ధన్ సూసైడ్ నోట్ రాసి ఇవాళ ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయారు. ఆత్మహత్య చేసుకుంటున్నట్లు అందులో పేర్కొన్నారు. దీంతో ఆయన అదృశ్యమైనట్లు న్యూపోర్టు పోలీసులకు కుటుంబసభ్యులు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు.. అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో దువ్వాడ రైల్వేస్టేషన్‌లో హర్షవర్ధన్ ఆత్మహత్య చేసుకున్నట్లు గుర్తించారు.
