success | ముగిసిన కోటి సంతకాల సేకరణ
success | గుడివాడ, ఆంధ్రప్రభ : గుడివాడ నియోజకవర్గంలో ప్రభుత్వ మెడికల్ కళాశాలలో(medical college) ప్రైవేటీకరణ చేయడాన్ని నిరసిస్తూ వైఎస్ఆర్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పిలుపుమేరకు చేపట్టిన కోటి సంతకాల కార్యక్రమం నేటితో ముగిసిందని వైఎస్ఆర్సీపీ నాయకులు తెలిపారు.
గుడివాడ రాజేంద్రనగర్‌లోని నియోజకవర్గ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
ఈనెల 10వ తేదీన లింగవరం రోడ్డులోని కే కన్వెన్షన్‌లో జరుగనున్న కోటి సంతకాల సేకరణ ప్రతులను జిల్లా పార్టీకి అందజేసే కార్యక్రమంలో మాజీ మంత్రి కొడాలి నాని పాల్గొంటారని, ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు కార్యకర్తలు భారీగా తరలివచ్చి విజయవంతం(success) చేయాలని నాయకులు కోరారు.
ఈ కార్యక్రమం బుధవారం ఉదయం 10 గంటలకు ప్రారంభం అవుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గుడివాడ పట్టణ అధ్యక్షులు గొర్ల శీను, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షులు మట్టా జాన్ విక్టర్, నందివాడ మండలం ఎంపీపీ పేయ్యల ఆదాము, జడ్పీటీసీ గోళ్ళ రామకృష్ణ, కందుల నాగరాజు, చింతాడి నాగూర్, గంటా శీను తదితరులు పాల్గొన్నారు.

