ఉపాధ్యాయ వేతనాలపై విద్యా కమిషన్ వ్యాఖ్యలు బాధాకరం

ఉపాధ్యాయ వేతనాలపై విద్యా కమిషన్ వ్యాఖ్యలు బాధాకరం

  • ఎస్టీయూటీఎస్ జిల్లా కార్యదర్శి కొరవి సుధాకరాచారి

తొర్రూరు, ఆంధ్రప్రభ : తెలంగాణ విద్యా కమిషన్ ప్రభుత్వానికి సమర్పించిన ‘ఏడ్యుకేషన్ పాలసీ ఫర్ తెలంగాణ 2026 రిపోర్టులో టీచర్లకు జీతాలు ఎక్కువగా ఉన్నాయి” అనే అంశాన్ని చేర్చడం అత్యంత బాధాకరమని ఎస్టీయూ టీఎస్ మహబూబాబాద్ జిల్లా కార్యదర్శి కొరవి సుధాకరాచారి తెలిపారు. శుక్రవారం తొర్రూరులో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు ఉపాధ్యాయుల్లో మనోవేధన కలిగించడంతో పాటు వారి వృత్తి గౌరవాన్ని దెబ్బతీసే విధంగా ఉన్నాయనీ అభిప్రాయపడ్డారు. సమాజంలో ఉపాధ్యాయులపై తప్పుడు సంకేతాలు వెళ్లే ప్రమాదం ఉందననారు. భారతదేశంలో పలు రాష్ట్రాలతో పాటు వివిధ దేశాల్లో ఉపాధ్యాయ వేతనాలు తెలంగాణ రాష్ట్రం కంటే ఎక్కువగా ఉన్నాయనీ గుర్తు చేశారు.

విద్యా కమిషన్ తమ పరిధి దాటి ఈ విధంగా ప్రస్తావించడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. రాష్ట్రంలో విద్యా వ్యవస్థపై సమగ్ర అధ్యాయనం చేసి పాఠశాలల పరిస్థితులు, విద్యా ప్రమాణాల పెంపు, విద్యారంగ పురోగతిపై ప్రభుత్వానికి మంచి నివేధిక అందిస్తారని ఆశించామని, ఉపాధ్యాయుల జీతభత్యాలు, ఉపాధ్యాయ నియామక అర్హతలు, పదోన్నతులు వంటి అంశాలను ప్రతికూలంగా ప్రస్థావించడం దురదృష్టకరమని ఆవేధన వ్యక్తం చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో మూడేళ్లుగా పీఆర్సీ, నాలుగు డీఏలు, పెండింగ్ బిల్లుల రాక ఉద్యోగ, ఉపాధ్యాయులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఉపాధ్యాయ న్యాయమైన డిమాండ్లు పరిష్కారం అయ్యేంత వరకు ఎస్టీయూ టీఎస్ పోరాటాలు చేస్తుందని గుర్తు చేశారు.ఈ కార్యక్రమంలో గన్నోజు ప్రసాద్, శ్రీరాములు,యాకయ్య, శ్రీనివాస్, రమేష్,ఎస్టీయూ ప్రతినిథులు పాల్గొన్నారు.

Leave a Reply