VILLAGE| బిక్కనూర్, ఆంధ్రప్రభ : మండలంలోని సిద్ధిరామేశ్వర నగర్ గ్రామంలో శుక్రవారం ఎన్నారైడి బృందం పర్యటించింది. గ్రామంలో గల గ్రామ సంఘాల పనితీరును బృందం సభ్యులు పరిశీలించారు. వివిధ బ్యాంకుల ద్వారా తీసుకున్న రుణాలతో చేస్తున్న వ్యాపారాలను వారిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం గ్రామ సంఘాల ఆడిటింగ్ రిపోర్టులను పరిశీలించారు. సంఘాలు మరింత బలోపేతం కావాలని బృందం సభ్యులు సూచించారు. కార్యక్రమంలో ఉత్తర్ ప్రదేశ్ ,జమ్మూకాశ్మీర్, మహారాష్ట్ర ,ఒరిస్సా, రాష్ట్రాలకు చెందిన బృందం సభ్యులు స్థానిక ఐకెపి సిబ్బంది ఉన్నారు.
VILLAGE| గ్రామ సంఘాల పనితీరుపై అధ్యయనం…

