Study Material | పేద విద్యార్థులు ఉన్నంత స్థాయికి ఎదగాలి…

Study Material | పేద విద్యార్థులు ఉన్నంత స్థాయికి ఎదగాలి…
- ప్రజా ట్రస్ట్ చైర్మన్ బోస్లే మోహన్ రావు పటేల్
- పది విద్యార్థులకు స్టడీ మెటీరియల్ అందజేత
Study Material | కుంటాల, ఆంధ్రప్రభ : గ్రామీణ ప్రాంతాల్లో ఉండే నిరుపేద విద్యార్థులు ఉన్నతమైన స్థాయికి ఎదగాలని ముధోల్ బీజేపీ సీనియర్ నాయకులు ప్రజా ట్రస్టు చైర్మన్ బోస్లే మోహన్ రావు పటేల్ అన్నారు. ఈ రోజు కుంటాల మండలంలోని ప్రభుత్వ పాఠశాలల్లో పదవ తరగతి చదువుతున్న విద్యార్థులకు అవసరమై స్టడీ మెటీరియల్(Study material)ను ఆయన ఉచితంగా అందజేశారు.
కుంటాల మండలంలోని ప్రభుత్వ పాఠశాలలైన లింబా కే ఓలా కుంటాల జెడ్పి పాఠశాల ఆదర్శ పాఠశాలతోపాటు కస్తూరిబా గాంధీ విద్యాలయంలో పదవ తరగతి విద్యార్థులకు అవసరమయ్యే ఆల్ ఇన్ వన్ బుక్స్(All-in-One Books)లను విద్యార్థులకు అందజేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పేద విద్యార్థులు కార్పొరేట్ స్థాయికి దీటుగా పోటీ పరీక్షల్లో నెగ్గేందుకు స్టడీ మెటీరియల్ ఎంతగానో ఉపయోగపడుతుందని ఆయన అన్నారు.
విద్యార్థులు సద్వినియోగం చేసుకొని భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని ఆయన సూచించారు. ముధోల్ నియోజకవర్గంలోని మోహన్ రావు పటేల్ ప్రజా ట్రస్టు(public trust) ద్వారా అనేక సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఆపద కాలంలో పేదలకు బాసటగా నిలవడం జరుగుతుందని అన్నారు. ప్రకృతి విపత్తులు తమ నిరుపేదలకు కష్టాలు ఎదురైనప్పుడు తమ ట్రస్టు సేవా కార్యక్రమాలను చేపడుతూ ముందుకు సాగడం జరుగుతుందన్నారు.
నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో ప్రజా ట్రస్టు సేవలను మరింతగా విస్తరిస్తామని మోహన్ రావు పటేల్ తెలిపారు. పెద్ద మనసుతో పేద విద్యార్థులకు స్టడీ మెటీరియల్(Study Material)ను అందజేసిన ప్రజా ట్రస్టు చైర్మన్ బోస్లే మోహన్ రావు పటేల్ కు విద్యార్థులు ఉపాధ్యాయులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
వచ్చే విద్యా సంవత్సరం నుండి ఇంటర్ విద్యార్థులకు సైతం ఉచిత స్టడీ మెటీరియల్ ను అందజేస్తానని విద్యార్థులు ఉత్తమ మార్కులు సాధించి ప్రయోజకులుగా మారాలని ఆయన సూచించారు. విద్యార్థులకు చదువు ఎంతో కీలకమని చదువుతూనే భవిష్యత్తు లభిస్తుందని తల్లిదండ్రుల ఆశలు నెరవేర్చేందుకు చదువు ఎంతో అవసరమని ప్రతి ఒక్క విద్యార్థి పోటీ పరీక్షల్లో(competitive exams) పట్టుదలతో చదువుకొని ఉత్తమ మార్పులు సాధించాలని ఆయన ఆకాంక్షించారు.
అనంతరం ఆయా ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయులు, విద్యార్థులు, బూస్లే మోహన్ రావు పటేల్(Boosle Mohan Rao Patel)కు శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచులు సుంకారి గీత మహేష్, కట్ట రవి, జక్కుల గజేందర్, మండల విద్యాధికారి వట్టూలి ముత్యం, బిజెపి పార్టీ మాజీ అధ్యక్షుడు గుద్దేటి నరయ్య, సదాశివ్ పటేల్, తాటి శివ, సుభాష్ పటేల్, ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.
