study | చదువు ద్వారానే సమాజంలో ఉజ్వల స్థానం..

study | చదువు ద్వారానే సమాజంలో ఉజ్వల స్థానం..
కేశినేని ఫౌండేషన్ డైరెక్టర్ కేశినేని వెంకట్..
study | తిరువూరు, ఆంధ్రప్రభ : క్రమశిక్షణతో కూడిన చదువు ద్వారానే సమాజంలో ప్రతి ఒక్కరికీ ఉజ్వల స్థానం లభిస్తుందని, చదువు ద్వారానే ప్రతి ఒక్కరూ ఉన్నత స్థానాలకు ఎదిగి పేదరికంపై విజయం సాధించవచ్చని ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) తనయులు, కేశినేని ఫౌండేషన్ డైరెక్టర్ కేశినేని వెంకట్ అన్నారు. నడిం తిరువూరు పీఏసీఎస్ అధ్యక్షులు కంచి రఘు ప్రవీణ్ (బాబి) ఆధ్వర్యంలో తిరువూరులోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో పదో తరగతి పరీక్షలకు హాజరయ్యే విద్యార్థినిలకు మహిళా దినోత్సవంను పురస్కరించుకుని పరీక్షలకు ఉపయోగపడే జామింట్రీ బాక్స్‌లను ఆదివారం పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా హాజరైన కేశినేని ఫౌండేషన్ డైరెక్టర్ వెంకట్‌బాబు విద్యార్థినిలకు పరీక్షలకు ఉపయోగపడే జామింట్రీ బాక్స్‌లను రాష్ట్ర ఆర్గానిక్ సర్టిఫికేషన్ అథారిటీ బోర్డు చైర్మన్ శావల దేవదత్ తదితర పెద్దలతో కలసి అందజేశారు. విద్యార్థినిలతో కొద్దిసేపు మాట్లాడి పరీక్షలకు ఏ విధంగా ప్రిపేర్ అవుతున్నారో అడిగి తెలుసుకుని ఆల్ ది బెస్ట్ చెప్పారు. ఇదే సందర్భంలో మహిళా దినోత్సవంను పురస్కరించుకుని పలువురు మహిళా ప్రముఖులను సత్కరించారు.

మహిళా ఏఎసఐ లక్ష్మీ, హెడ్ కానిస్టేబుల్ సీహెచ్ అరుణ, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు బి మృదులతో పాటుగా పలువురు మహిళా ఉపాధ్యాయులను సత్కరించి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా టిడిపి ఉపాధ్యక్షులు తాళ్లూరి రామారావు, ఎన్టీఆర్ జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షులు సొంగా సంజయ్ వర్మ, టీఎన్‌టీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి చరణ్ సాయి, శాలివాహన కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ సత్యవతి, తిరువూరు మండల పార్టీ అధ్యక్షులు దుబ్బాకు వెంకటేశ్వరరావు, మాజీ ఎంపీపీ గద్దే వెంకటేశ్వరరావు, తిరువూరు అర్బన్ పార్టీ క్లస్టర్ ఇన్‌ఛార్జి కె.శివరామకష్ణ , కౌన్సిలర్ ఎం.దుర్గారావు, ఎన్టీఆర్ జిల్లా తెలుగు యువత అధికార ప్రతినిధి మాదాల హరిచరణ్ (కిట్టూ), తెలుగు యువత నియోజకవర్గ ఉపాధ్యక్షులు ఎస్‌కె హుస్సేన్, సీనియర్ నాయకులు గత్తం నాగేశ్వరరావు, కందిమళ్ల శేషగిరిరావు, పెరుమాళ్ల నిరంజన్, తెలుగు యువత నాయకులు సాయిసుమిత్,16వ వార్డు అధ్యక్షురాలు సుంకర లత, జనసేన పార్టీ నాయకులు సుధాకర్, రవీంద్ర, జగన్ తదితరులు పాల్గొన్నారు.




CLICK HERE TO READ MORE : కేశినేని ఫౌండేషన్ ద్వారా సేవా కార్యక్రమాలు..
