Students | ఉన్నత శిఖరాలకు చేరుకోవాలంటే..

Students | ఉన్నత శిఖరాలకు చేరుకోవాలంటే..
Students, హసన్ పర్తి, ఆంధ్రఫ్రభ : విద్యార్థులు క్రమశిక్షణతో విద్యను అభ్యసించి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని లైఫ్ కోచ్, ఫ్యామిలీ కౌన్సిలర్ రామా రావి సూచించారు. హన్మకొండ జిల్లా హసన్ పర్తి మండలం ఎల్లాపూర్ శివారులో గల ఆర్బిట్ ఇ- టెక్నో పాఠశాలలో ఘనంగా 15వ వార్షికోత్సవ (అభ్యుదయ-2026) వేడుకలను ఘనంగా అట్టాహసంగా నిర్వహించారు. ఈసందర్బంగా పాఠశాల వ్యవస్థాపకులు, చైర్ పర్సన్ చిట్టిరెడ్డి భగవాన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో ముఖ్య అతిథిగా విచ్చేసిన రమా రావి మాట్లాడుతూ.. విద్యార్థినీ, విద్యార్థుల పై తల్లిదండ్రుల పర్యవేక్షణ తప్పనిసరి అవశ్యకమని పేర్కొన్నారు. బాల బాలికలందరూ సమానమని, సమయ పాలనతో చదువుతూ అన్ని నైపుణ్యాలను సాధించి మంచి ఫలితాలతో ఉత్తీర్ణత సాధించాలని కోరారు. బాల్య దశ నుంచే తోటి వారికి సహాయం చేసే స్వభావం కలిగి ఉండాలని తెలిపారు.
ఈసీజీ ఫౌండర్, సైకాలజిస్ట్ గూడల్లి శివప్రసాద్ మాట్లాడుతూ.. సోషల్ మీడియా విద్యార్థుల పై ప్రభావం చూపుతున్నదని అన్నారు. విద్యార్థినీ, విద్యార్థులు తమ తల్లిదండ్రులు ఎలా కష్టపడుతున్నారో తెలుసుకొని, విద్య పై దృష్టి సారించాలని వివరించారు. ఉత్తమ ఫలితాలతో తల్లిదండ్రులు, గురువులకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు. ఉపన్యాసాలతో పాటు, సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా పిరమిడ్స్, పాటలు, డ్యాన్సులు, పరేడ్, స్కిట్ (నాటకాలు)లలో విద్యార్థులు ఉత్సాహంగ పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ చిట్టి రెడ్డి హారిక రెడ్డి, అకాడమిక్, ఇంచార్జి వాసుదేవరెడ్డి, మధుకర్, సారంగపాణి , జావిద్ ఖాన్, వెంకటేష్, రాజేష్, రాహుల్ రాజ్, అశోక్ రెడ్డి, మహేష్, చంద్రమోహన్, మురళీకృష్ణ, ప్రశాంత్, శ్రీనివాస్ , సాయి కళ్యాణ్ ,కళ్యాణి, వహీదా బేగం, షర్మిల, స్వర్ణలత, రసజ్ఞ, రూపా దేవి, ,శ్వేతా రెడ్డి ,శ్వేత, ప్రవళిక, రజిత, రాధిక, విద్యార్థిని, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.
