విద్యార్థులు చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలి
ఓపెన్ హౌస్ కార్యక్రమంలో ఎస్ఐ ఉమాసాగర్…
వెల్గటూర్, అక్టోబర్ 24 (ఆంధ్ర ప్రభ) : విద్యార్థినీ, విద్యార్థులు చెడు వ్యసనాలకు దూరంగా ఉంటూ, మంచు భవిష్యత్తు నిర్మించుకొని ఉన్నత విద్యను అభ్యసించాలని స్థానిక ఎస్ఐ ఉమాసాగర్ (Umasagar) అన్నారు. వెల్గటూర్ మండల కేంద్రంలో పోలీస్ అమర వీరుల సంస్మరణ వారోత్సవాలు పురస్కరించుకుని జగిత్యాల జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు స్థానిక ఎస్ఐ ఉమాసాగర్ ఆధ్వర్యంలో ఓపన్ హౌస్ కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు (students) హాజరై పోలీస్ స్టేషన్లో గల స్టేషన్ హౌస్ ఆఫీస్, రిసెప్షన్ సెంటర్, బెల్ ఆఫ్ ఆమ్, వైర్లెస్ సెట్, ఫైర్ డిటైల్స్, తో పాటి డయల్ 100 నంబర్ పని తీరు గుంరించి అడిగి తెలుసుకున్నారు.అనంతరం ఎస్ ఐ ఉమాసాగర్ పోలీసు స్టేషన్ పని తీరును, పోలీస్ స్టేషన్లో నిర్వహించే విధులు,పౌరులు పొందాల్సిన సేవల గురించి వివరించారు. మైనర్ విద్యార్థులు ద్విచక్ర వాహనాలు నడపరాదని విద్యార్థులకు అవగహన కల్పించారు. విద్యార్థులు జీవితంలో సాధించాల్సిన అంశాలు చదువు ప్రాముఖ్యత ను తెలిపారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది, విద్యార్థులు, పాఠశాల ఉపాద్యాయులు పాల్గొన్నారు.

