Students | పాలన అనుభవంతో మరింత అభివృద్ధి…

Students | పాలన అనుభవంతో మరింత అభివృద్ధి…

Students | భీమ్‌గల్ టౌన్/ రూరల్, ఆంధ్రప్రభ : గతంలో పాలించిన అనుభవంతో గ్రామాన్ని మరింత అభివృద్ధి చేస్తానని ఇండిపెండెంట్ సర్పంచ్ అభ్యర్థి బుర్ర సుమ దేవేందర్ గౌడ్ అన్నారు. సర్పంచ్ గా గెలిపిస్తే గ్రామంలో మరింత అభివృద్ధి(Development) చేస్తానని పేర్కొన్నారు. అంగన్వాడీ భవనం నిర్మాణం, ఆరోగ్య కేంద్ర భవనం నిర్మించి అందుబాటులోకి తేవడం తన బాధ్యత అన్నారు.

ముఖ్యంగా గ్రామంలో కోతులతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని కోతుల బెడద లేకుండా కోతులను పట్టి అడవుల్లోకి పంపించేందుకు కృషి చేస్తానని తెలిపారు. ప్రజలు తీవ్ర నీటి కొరతతో ఇబ్బందులు పడుతున్నారని నీటి సమస్య పరిష్కారం, మిషన్ భగీరథ(Mission Bhagiratha) ద్వారా ఇంటింటికి నల్లా ద్వారా నీటి సరఫరా చేస్తానని చెప్పారు.

మురికి కాలువల నిర్మాణం చేయడంతో పాటు గ్రామంలో మౌలిక వసతుల ఏర్పాటుకు తనవంతు నిధులు(Funding) సాధించి పరిష్కారం చేస్తానని అన్నారు. మహిళగా మహిళల సమస్యలు పరిష్కారం కొరకు ముందుండి పని చేస్తానని అన్నారు. తనకు కేటాయించిన ఫుట్బాల్ గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్తించారు. గ్రామం లో ఎవరికీ ఎలాంటి సమస్యలు వచ్చిన ముందుండి పని చేసే గుణం ఉన్న తనను ఆదరించాలని కొరారు.

స్టూడెంట్స్(Students) కు కావాల్సిన సర్టిఫికెట్ లు ఇంటి వద్దకే తెచ్చి ఇచ్చే బాధ్యత తనపై ఉందని గతంలో అధికారం లేకున్నా పని చేసి పెట్టానని అధికారం ఉంటే మరింత అందుబాటులో ఉండి సేవ చేస్తానని బుర్ర సుమ దేవేందర్ గౌడ్ స్పష్టం చేశారు. నేడు జరిగే పోలింగ్ లో ఫుట్బాల్ గుర్తుకు ఓటు వేయాలని కోరారు.

Leave a Reply