HIV | ఎయిడ్స్‌పై విద్యార్థులకు అవగాహన
HIV | బండి ఆత్మకూరు, ఆంధ్రప్రభ : ప్రపంచ ఎయిడ్స్ (AIDS) దినోత్సవం సందర్భంగా మండల పరిధిలోని నారాయణపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు వైద్య అధికారులు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్యాధికారి డాక్టర్ దినేష్ బాబు మాట్లాడుతూ హెచ్ఐవీ వ్యాధి పై విద్యార్థులు అవగాహన కలిగి ఉండాలన్నారు. చికిత్స కన్నా నివారణ మంచిదని తెలిపారు. అసురక్షిత లైంగిక సంబంధాలు, హెచ్ఐవీ ఉన్న గర్భిణి నుంచి పుట్టబోయే బిడ్డకు, హెచ్ఐవీతో కలుషితమైన సూదులు సిరంజీలు, పరీక్షింపబడని రక్తం ద్వారా మాత్రమే సంక్రమించే అవకాశం ఉందని తెలిపారు. ఇక ప్రభుత్వ ఆసుపత్రులలో హెచ్ఐవీ పరీక్షలు ఉచితంగా అందుబాటులో ఉన్నాయని, అలాగే పరీక్షలు చేయించుకున్న వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయని తెలిపారు. అనంతరం విద్యార్థులతో కలిసి ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో స్టాఫ్ నర్సు కల్పన, స్కూల్ హెచ్‌ఎం శ్రీనివాసులు, టీచర్ సుబ్బయ్య, ఏఎన్ఎమ్ రాజేశ్వరమ్మ, ఆశాలు రంగమ్మ, అనూష, విద్యార్థులు పాల్గొన్నారు.

