Students | విడుద‌ల చేసిన ప్రభుత్వ సలహాదారు కె.కేశవరావు

Students | విడుద‌ల చేసిన ప్రభుత్వ సలహాదారు కె.కేశవరావు

Students | ఆంధ్ర‌ప్ర‌భ వెబ్‌డెస్క్ : తెలంగాణ ఇంటర్​ ఫ‌స్టియ‌ర్‌, సెకండియ‌ర్ రిజ‌ల్ట్స్ విడుదలయ్యాయి. ఆదివారం ప్రభుత్వ సలహాదారు కె.కేశవరావు, ప్రభుత్వ విద్యాశాఖ కార్యదర్శిలు ఇంటర్​బోర్డు కార్యాలయంలో విడుదల చేశారు. ఈ ఏడాది రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 9,97,075 మంది విద్యార్థులు రాశారు. ఈ ఏడాది ఫిబ్రవరి 25వ తేదీ నుంచి మార్చి 18 వరకు ఇంటర్‌ పరీక్షలు జ‌రిగాయి. ఇంటర్ ఫస్ట్ ఇయర్‌లో 66.20 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. ఇక సెకండియర్‌లో 70.58 శాతం మంది స్టూడెంట్స్ పాస్ అయ్యారు. ఇక ఈసారి పరీక్షలు జరిగిన 25 రోజుల్లోనే రిజల్ట్స్‌ను విడుదల చేయడం విశేషం.

ఇంటర్ ఫస్ట్ ఇయర్‌లో 66.20 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. ఇక సెకండియర్‌లో 70.58 శాతం మంది స్టూడెంట్స్ పాస్ అయ్యారు. ఇందులో బాలికలు 74.4 శాతం ఉత్తీర్ణత సాధించగా బాలురు 57.69 శాతం మంది పాస్ అయ్యారు. ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు 3,23,807 మంది విద్యార్థులు పాస్ కాగా.. ఇంటర్ సెకండియర్‌లో 5,07,494 లక్షల మంది పరీక్షలు రాయగా.. 3,58,490 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు.

వాట్సాప్‌లో రిజ‌ల్ట్‌..

ఇంటర్‌ విద్యార్థులు తమ ఫలితాలను నేరుగా వాట్సప్‌ ద్వారా తెలుసుకునే సదుపాయాన్ని ప్రభుత్వం కల్పిస్తోంది. ఈ సర్వీస్‌ను మంత్రి శ్రీధర్‌బాబు సచివాలయంలో శనివారం ఆవిష్కరించారు. స్మార్ట్‌ ఫోన్‌ నుంచి 8096958096 నంబరుకు వాట్సప్‌లో ‘Hi’ అని పంపి.. అందులో వచ్చిన వివరాల ప్రకారం తమ రోల్‌ నంబరు, సంవత్సరం, గ్రూపు వివరాలు నమోదు చేస్తే ఫలితాలను పొందొచ్చు.

https://tgbie.in/result.html

Leave a Reply