విద్యార్థుల భద్రతపై తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలి…

విద్యార్థుల భద్రతపై తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలి…

  • చిట్యాల ఎస్సై పోచంపల్లి సతీష్,

చిట్యాల, ఆంధ్రప్రభ : విద్యార్థుల భద్రత పట్ల తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని చిట్యాల ఎస్ఐ పోచంపల్లి సతీష్ అన్నారు. ఆదివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, వేసవిలో పాఠశాలల్లో ఒంటిపూట బడులు ప్రారంభం కానున్న నేపథ్యంలో, విద్యార్థుల భద్రత పట్ల, తల్లిదండ్రులు, అప్రమత్తంగా ఉండాలన్నారు. ​వేసవి ఉష్ణోగ్రతలతో పిల్లలు, ఈత కోసం వాగులు చెరువులు, బావులు, కుంటలవంటి నీటి వనరుల వద్దకు వెళ్లే ప్రమాదం ఉందని, తల్లిదండ్రులు తమ పిల్లల కదలికలపై కచ్చితమైన నిఘా ఉంచాలని, ఆయన కోరారు.

మైనర్ పిల్లలకు ద్విచక్ర వాహనాలు, ఇతర వాహనాలు ఇవ్వకూడదని తెలిపారు. మైనర్లు వాహనాలు నడుపుతూ పట్టుబడితే, నిబంధనల ప్రకారం చట్టపరమైన కఠిన చర్యలుతీసుకుంటామన్నారు. విద్యార్థుల, ఆరోగ్యం, భద్రతకు సంబంధించి తల్లిదండ్రులు మరింత జాగ్రత్తగా వ్యవహరించాలని ఎస్సై సతీష్ విజ్ఞప్తి చేశారు.

Leave a Reply