వీధి దీపాల సమస్యలు పరిష్కరించాలి

వీధి దీపాల సమస్యలు పరిష్కరించాలి
- ప్రజావాణిలో బీజేపీ నేతల వినతి
మేడ్చల్, ఆంధ్రప్రభ : సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మేడ్చల్ సర్కిల్ మేడ్చల్ డివిజన్ పరిధిలోని పలు ప్రజా సమస్యలను పరిష్కరించాలని కోరుతూ మేడ్చల్ సర్కిల్ ఆఫీస్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో బీజేపీ నాయకులు అధికారులకు వినతిపత్రం సమర్పించారు. వినతిపత్రం అందజేసిన అనంతరం నాయకులు మాట్లాడుతూ.. రోడ్ల పరిస్థితి దారుణంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా మేడ్చల్ నుండి గిర్మాపూర్ వెళ్లే దారిలో భారీ గుంతలు ఏర్పడి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, వెంటనే గుంతలను పూడ్చాలని కోరారు.
ఇదే మార్గంలో వీధి దీపాలు వెలగకపోవడంతో రాత్రి వేళల్లో ప్రయాణికులు, పాదచారులు భయాందోళనకు గురవుతున్నారని పేర్కొన్నారు. మేడ్చల్ హౌసింగ్ బోర్డ్ కాలనీ నుండి స్థానిక గ్రంథాలయం వరకు అసంపూర్తిగా ఉన్న రోడ్డు పనులను తక్షణమే పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్ మున్సిపాలిటీ మాజీ బీజేపీ అధ్యక్షులు కొండం ఆంజనేయులు ముదిరాజ్, బీజేపీ సీనియర్ నాయకులు బొక్క అంజి రెడ్డి, బీజేవైఎం జిల్లా కార్యదర్శి రాఘవ రెడ్డి, మేడ్చల్ డివిజన్ బీజేపీ కార్యదర్శి బండి విష్ణు గౌడ్, బీజేపీ యువ నాయకులు రాగం ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.
