ముంబై : దేశీయ స్టాక్‌ మార్కెట్లు (Indian stock market) మంగళవారం నష్టాల్లో ముగిశాయి. మార్కెట్లు ఉదయం లాభాల్లో మొదలైనా.. చివరకు నష్టాల్లోకి జారుకున్నాయి. మదురుపరులు లాభాల స్వీకరణకు దిగడంతో మార్కెట్లు నష్టాల్లోకి (Markets in losses) వెళ్లాయి. క్రితం సెషన్‌తో పోలిస్తే.. 80,520 పాయింట్ల వద్ద లాభాల్లో మొదలైన సెన్సెక్స్‌.. ఇంట్రాడేలో 70,761.14 పాయింట్ల గరిష్ఠానికి చేరిన సెస్సెక్స్‌.. 80,008.50 పాయింట్ల కనిష్ఠానికి చేరుకుంది. చివరకు 206.61 పాయింట్లు పతనమై.. 80,157.88 వద్ద ముగిసింది.

నిఫ్టీ (Nifty) 45.45 పాయింట్లు తగ్గి 24,579.60 వద్ద స్థిరపడింది. దాదాపు 2,413 షేర్లు లాభపడగా.. 1,551 షేర్లు పతనమయ్యాయి. డాలర్ ఐదు వారాల కనిష్ట స్థాయికి చేరుకుంది. బంగారం రికార్డు స్థాయికి చేరుకుంది. పెట్టుబడిదారులు ఈ వారం ఆర్థిక డేటా కోసం ఎదురుచూస్తున్నారు. సెప్టెంబర్‌లో ఫెడరల్ రిజర్వ్ రేట్ల కోత (Federal Reserve rate cut in September) అంచనాలను బలోపేతం చేయనున్నది. ఈ నెల చివరలో ఫెడ్ వడ్డీ రేట్లను తగ్గిస్తుందని మార్కెట్లు విస్తృతంగా అంచనా వేస్తున్నాయి.

25 బేసిస్ పాయింట్ల కోతకు 89శాతం అవకాశం ఉంది. కానీ, ఈ వారం డేటా పెట్టుబడిదారులు సెంట్రల్ బ్యాంక్ కోత దిశగా మొగ్గు చూపుతుందా? లేదా? అంచనా వేసేందుకు సహాయపడనున్నది. ఫెడ్ పాలసీ (Fed policy) సమావేశానికి వారం ముందు, సెప్టెంబర్ 11న విడుదల కానున్న ఆగస్టు మాసానికి సంబంధించిన యూఎస్‌ ద్రవ్యోల్బణ నివేదిక, కేంద్ర బ్యాంకు దశలను నిర్ణయించడంలో కీలక పాత్ర పోషిస్తుంది.

Leave a Reply