Stock Market – లాభాలతో షేర్ మార్కెట్ ప్రారంభం

ముంబై| షేర్ మార్కెట్ నేడు సెన్సెక్స్‌ 130 పాయింట్ల లాభంతో ప్రారంభం కాగా.. నిఫ్టీ 24,100 పైన ట్రేడింగ్‌ మొదలుపెట్టింది.ఉదయం 9:25 గంటల సమయంలో సెన్సెక్స్‌ 282 పాయింట్ల లాభంతో 79,483 వద్ద ట్రేడవుతుండగా.. నిఫ్టీ 53 పాయింట్ల లాభంతో 24,092 వద్ద ఉన్నాయి.

రిలయన్స్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ వంటి ప్రధాన షేర్లలో కొనుగోళ్ల మద్దతుతో మార్కెట్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి.

సెన్సెక్స్‌ 30 సూచీలో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, ఎంఅండ్‌ఎం, సన్‌ఫార్మా, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, ఎటర్నల్‌, ఎస్‌బీఐ, భారతీ ఎయిర్‌టెల్‌, టాటా స్టీల్‌, ఎన్టీపీసీ, యాక్సిస్‌ బ్యాంక్‌ షేర్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి. హెచ్‌సీఎల్‌ టెక్నాలజీ, మారుతీ సుజుకీ, ఏషియన్‌ పెయింట్స్‌, నెస్లే ఇండియా, అల్ట్రాటెక్‌ సిమెంట్‌, బజాజ్‌ ఫైనాన్స్‌ షేర్లు నష్టాల్లో కదలాడుతున్నాయి.

అమెరికా మార్కెట్లు లాస్ట్‌ ట్రేడింగ్‌ సెషన్‌లో ఫ్లాట్‌గా ముగిశాయి. డోజోన్స్‌ 0.05 శాతం, నాస్‌డాక్‌ 1.26 శాతం, ఎస్‌అండ్‌పీ 500 సూచీ 0.74 శాతం లాభంతో ముగిశాయి. ఆసియా-పసిఫిక్‌ మార్కెట్లు నేడు మిశ్రమంగా ట్రేడవుతున్నాయి. ఆస్ట్రేలియన్‌ ఏఎస్‌ఎక్స్‌ 0.78 శాతం, నిక్కీ మాత్రం 0.51 శాతం లాభంతో కదలాడుతుంటే.. హాంకాంగ్‌, షాంఘై ఫ్లాట్‌గా ట్రేడవుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్‌ క్రూడ్ బ్యారెల్‌ 63.20 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. బంగారం ఔన్సు 3,303 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. విదేశీ సంస్థాగత మదుపర్లు (FIIs) లాస్ట్‌ ట్రేడింగ్‌ సెషన్‌లో నికరంగా రూ.2,952 కోట్ల విలువ చేసే షేర్లను కొనుగోలు చేయగా.. దేశీయ సంస్థాగత మదుపర్లు (DIIs) నికరంగా రూ.3,540 కోట్ల షేర్లు కొనుగోలు చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *