Statement | భార్య స్టేట్మెంట్ ఆధారంగా ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి

Statement | భార్య స్టేట్మెంట్ ఆధారంగా ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి
- పోలీసులు ఎఫ్ఐఆర్ మార్చే వరకు పోస్టుమార్టం జరిగేది లేదు
- కుటుంబాన్ని బెదిరింపులను కాంగ్రెస్ నాయకులు మానుకోవాలి
- మృతుడు ఎరుకలి మహాదేవ కుటుంబానికి బీజేపీ అండగా ఉంటుంది
- బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్రావు
Statement | మక్తల్, ఆంధ్రప్రభ : నారాయణపేట జిల్లా మక్తల్ మున్సిపాలిటీ పరిధిలోని 6వ వార్డు నుండి బిజెపి అభ్యర్థిగా బరిలో నిలిచిన ఎరుకలి మహదేవ్ ఆత్మహత్యపై మృతుడి భార్యా స్టేట్మెంట్ ఆధారంగానే ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని బిజెపి రాష్ట్ర అధ్యక్షులు రామచందర్రావు డిమాండ్ చేశారు. పోలీసులు రూపొందించిన ఎఫ్ఐఆర్ ను మార్చాలని అప్పటివరకు పోస్ట్ మార్టం జరిగేది లేదని ఆయన స్పష్టం చేశారు. పోలీసులు ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేయాలి తప్ప ముఖ్యమంత్రి,మంత్రి చెప్పిన విధంగా కాంగ్రెస్ కార్యకర్తల్లా పనిచేయవద్దని హితవు పలికారు .మృతుడి కుటుంబాలకి న్యాయం చేయడం పోలీసుల బాధ్యత అనేది గుర్తురెగాలని అన్నారు .
మంగళవారం 6వ వార్డు కౌన్సిలర్గా పోటీ చేసి ఆత్మహత్యకు పాల్పడ్డ సంఘటనపై స్పందించిన ఆయన పార్లమెంటు సభ్యులు డికె. అరుణతో కలిసి మక్తల్ ప్రభుత్వాసుపత్రిలో మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ స్థానిక మంత్రి కాంగ్రెస్ నాయకులు బెదిరింపులకు పాల్పడడం వల్లే మానసికంగా కృంగి ఆత్మహత్య చేసుకున్నాడని అన్నారు .మహదేవ్ కాంగ్రెస్ నాయకంల బెదిరింపుల వల్లే ఆత్మహత్య చేసుకున్నట్లు మృతుడి భార్య సత్యమ్మ చెప్పడం జరిగిందని ఈ వార్త మీడియాలో వచ్చింది అన్నారు.
కానీ పోలీసులు ఎన్నికల్లో ఓడిపోతాననే భయంతో ఆత్మహత్య చేసుకున్నట్లు కంప్లైంట్ సిద్ధం చేసి మృతుడి భార్య వద్ద సంతకాలు తీసుకోవడం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు .భార్య స్టేట్మెంట్ ఆధారంగానే ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి తప్ప పోలీసులు చట్ట వ్యతిరేకంగా నడుచుకోవడం మంచిది కాదన్నారు .బిజెపి అభ్యర్థిగా ఎన్నికలలో మహదేవ్ పోటీ చేస్తున్నట్లు ప్రకటించిన సమయం నుండి అడుగడుగునా అధికార పార్టీ నాయకులు బెదిరింపులకు దిగారని అన్నారు. వారి బెదిరింపులతో ఊరు వదిలి మూడు రోజులు హైదరాబాదులో దాక్కోవడం జరిగిందన్నారు. చివరకు నామినేషన్ల ఉపశమన్న తర్వాత ప్రచారంలోనూ బెదిరింపులు కొనసాగాయని అన్నారు.
మహాదేవ్ గెలుపు ఖాయమని తేలిపోవడంతో అధికార పార్టీ నాయకులు జీర్ణించుకోలేక ఎరుకలి మహదేవ్ ను బెదిరింపులకు పాల్పడడం బెదిరింపులకు వల్ల ఈ సంఘటన చోటుచేసుకుందన్నారు. నువ్వు గెలిచాక కూడా నీ అంత చూస్తామంటూ ఈ తెల్లవారుజామున బెదిరించడం వల్లే బిజెపి అభ్యర్థి ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు అని అన్నారు .ఇలాంటి చర్యలకు దిగడం దుర్మార్గపు చర్యగా రామచంద్రరావు అభివర్ణించారు. ఈ సంఘటనపై పార్లమెంటు సభ్యులు డీకే అరుణ ఎన్నికల కమిషన్ తో మాట్లాడుతుందని హ్యూమన్ రైట్స్ కమిషన్ కూడా మక్తల్ రానున్నట్టు ఆయన తెలిపారు .సంఘటనపై పోలీసులు సమగ్ర విచారణ జరిపి మృతుడి కుటుంబానికి న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
మృతుడి భార్య స్టేట్మెంట్ ఆధారంగా కాకుండా తప్పుడు కంప్లైంట్ పై మృతుడి భార్య సంతకం తీసుకొని తప్పుడు ఎఫ్ఐఆర్ నమోదు చేసిన స్థానిక సిఐ,ఎస్ఐ లను సస్పెండ్ చేయాలని బిజెపి రాష్ట్ర అధ్యక్షులు రామచంద్ర డిమాండ్ చేశారు .బిజెపి రాష్ట్ర పార్టీ కృతుటి కుటుంబానికి అండగా ఉంటుందని చెప్పారు .10 లక్షల రూపాయలు ఆర్థిక సాయం అందించనున్నట్లు రామచందర్రావు ప్రకటించారు. ఈ సమావేశంలో బిజెపి రాష్ట్ర నాయకులు నాగురావు నామాజీ, కొండయ్య ,కొత్త కాపు రతంగపాడు రెడ్డి ,శంకరోళ్త రవికుమార్, స్థానిక నాయకులు ఎం .భాస్కర్ ,జి .బలరాం రెడ్డి, బి .రాజశేఖర్ రెడ్డి ,కర్ని స్వామి,కుర్వ హనుమంతు తదితరులు ఉన్నారు.
