పోలీస్ శాఖకు రాష్ర్ట ప్రభుత్వం అండ

పోలీస్ శాఖకు రాష్ర్ట ప్రభుత్వం అండ
ఉమ్మడి నల్లగొండ బ్యూరో, ఆంధ్రప్రభ : పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ద్వారా 6.65 కోట్లతో నల్లగొండ జిల్లా(Nalgonda District) కేంద్రంలోని పోలీస్ కార్యాలయం ఆవరణలో నూతనంగా నిర్మించిన ఏఆర్డీ ఎస్పీ.ఆర్.ఐ.ఆర్.ఎస్.ఐల (క్వాటర్స్) భవనాలను(buildings), శిశు విహార్‌ను రోడ్డు భవనాల, సినిమా టోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి(Minister Komatireddy) వెంకట్ రెడ్డి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పోలీస్‌శాఖకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తి అండగా నిలబడుతుందని చెప్పారు. శాంతి భద్రతల పరిరక్షణలో పోలీస్ శాఖ(Police Department) చేస్తున్న కృషి అమోఘమైందని కొనియాడారు.
శాసన మండలి సభ్యులు నెల్లికంటి సత్యం, ఐ.జీ.పీ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్(Housing Corporation) మేనేజింగ్ డైరెక్టర్ యం.రమేష్, డీ.ఐ.జీ జోన్-6, మల్టీ జోన్ 2 ఇంచార్జ్ తఫ్సిర్ ఇక్బాల్, జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఐఏఎస్(Ila Tripathi IAS), జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఐపీఎస్, అడిషనల్ కలెక్టర్ అమిత్ నారాయణ, ఏఎస్పీ మౌనిక ఐపీఎస్, అడిషనల్ ఎస్పీ రమేష్, తదితరులు పాల్గొన్నారు.
