విద్యార్థుల జీవితాలతో చెలగాటం..

విద్యార్థుల జీవితాలతో చెలగాటం..
అమరవీరుల స్థూపానికి వినతిపత్రం
నర్సంపేట, నవంబర్ 5 (ఆంధ్రప్రభ): పేద విద్యార్థుల జీవితాలతో రాష్ట్రం ప్రభుత్వం చెలగాటం ఆడుతుందని పట్టణంలోని తెలంగాణ అమరవీరుల స్థూపానికి ప్రైవేటు కళాశాలల (Private colleges) యాజమాన్యాలు వినతిపత్రం అందజేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేట్ కళాశాలల్లో చదువుకుంటున్న బీసీ, ఎస్సీ, ఎస్టీ పేద విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటుందని ఆచార్య కళాశాల ప్రిన్సిపాల్ జీజుల సాగర్ అన్నారు.
ఈసందర్భంగా సాగర్ మాట్లాడుతూ… రాష్ట్ర ప్రభుత్వం ఉపకార వేతనాలను చెల్లించకపోవడంతో సోమవారం నుండి కళాశాలల బంద్ (College closure) పాటిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వం మండివైఖరి వీడి వెంటనే ఉపకార వేతనాలు అందించాలని డిమాండ్ చేశారు. విద్యార్థులకు చెల్లించవలసిన ఉపకార వేతనాలను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. 1200కోట్ల రూపాయల ఉపకార వేతనాలు కళాశాలలకు చెల్లించవలసి ఉందని తెలిపారు.
ప్రభుత్వం ఇప్పటికైనా కళాశాలల పరిస్థితులను అర్థం చేసుకొని ఈ స్కాలర్ షిప్ లను వెంటనే విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అందుకు నిరసనగానే అమరవీరుల స్థూపానికి వినతిపత్రం అందించినట్లు పేర్కొన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే నిధులు విడుదల చేసి కళాశాలలను ఆదుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో సిద్ధార్థ కళాశాల చైర్మన్ గోగుల ప్రతాపరెడ్డి, బాలాజీ కళాశాల ప్రిన్సిపాల్ ఏం రామరాజు, అనిల్ కుమార్, శ్రీనివాస్, దూడయ్య, సిద్ధార్థ కళాశాల ప్రిన్సిపాల్ పురుషోత్తం తదితరులు పాల్గొన్నారు.
