state capital | భారీ ట్రాఫిక్ …
- ఓట్లు వేసేందుకు గ్రామాలకు తరలిన ప్రజలు
state capital | చౌటుప్పల్, ఆంధ్రప్రభ : హైదరాబాద్ – విజయవాడ 65వ నెంబర్ జాతీయ రహదారి గురువారం ఉదయం, సాయంత్రం వేళల్లో ట్రాఫిక్ పూర్తిగా స్తంభించిపోయింది. జాతీయ రహదారిపై టోల్ గేట్ల వద్ద వరదలా వచ్చిన ట్రాఫిక్ ను క్లియర్(Clear the traffic) చేయడం కోసం పోలీసులు చాలా కష్టపడాల్సి వచ్చింది.
గ్రామ పంచాయతీ ఎన్నికలను పురస్కరించుకుని మొదటి విడత గురువారం జరిగిన ఎన్నికలలో తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు గాను రాష్ట్ర రాజధాని(state capital) హైదరాబాదు నుండి చౌటుప్పల్ జాతీయ రహదారి మీదుగా నల్లగొండ, ఖమ్మం, భద్రాచలం కొత్తగూడెం, సూర్యాపేట జిల్లాలలోని వివిధ ప్రాంతాలకు సొంత వాహనాలలో, ప్రైవేటు వాహనాలలో ఓటర్లంతా ఒకేసారి ఉదయం తరలివెళ్లగా జాతీయ రహదారిపై ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోయి ప్రయాణికులు చాలా ఇబ్బందులు పడ్డారు.
అదేవిధంగా గ్రామాలకు వెళ్లిన ప్రజలంతా తమ ఓటు హక్కును వినియోగించుకున్న తర్వాత సాయంత్రం తిరుగు ప్రయాణంలో హైదరాబాదుకు తరలివెళ్తున్న వాహనాల సంఖ్య కూడా భారీగా ఉండడంతో ఉదయం మాదిరిగానే సాయంత్రం కూడా ట్రాఫిక్ ఎక్కడికక్కడ నిలిచిపోయింది. ట్రాఫిక్ ను క్లియర్ చేయడం పోలీసులకు భారంగా మారింది.

ఉదయం పూట వెళ్లేందుకు ఎక్కువ సంఖ్యలో గేట్లను ఓపెన్ చేయడంతో పాటు తిరుగు ప్రయాణ సమయంలో కూడా మళ్లీ రావడానికి ఎక్కువ గేట్లు ఓపెన్(gates open) చేశారు. అయినప్పటికీ ట్రాఫిక్ ను కంట్రోల్ చేయడం కోసం చౌటుప్పల్ ఏసిపి పటోళ్ల మధుసూదన్ రెడ్డి పర్యవేక్షణలో ఇన్స్పెక్టర్ మన్మధ కుమార్, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ విజయ్ మోహన్ ల ఆధ్వర్యంలో పోలీసులు ఎంతో శ్రమించారు.

