వైసీపీలో జోకర్ అంబటి రాంబాబు

వైసీపీలో జోకర్ అంబటి రాంబాబు

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై విమర్శలు చేస్తే సహించేది లేదు
ఎన్ టీ ఆర్ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు సామినేని ఉదయభాను

భవానిపురం, ఆంధ్రప్రభ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐదు కోట్ల ప్రజానికం రాష్ట్ర రాజధానిగా అమరావతిని ఒప్పుకుంటే, మాజీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి మాత్రమే “మావిగన్” నీ రాష్ట్ర రాజధానిని చేయాలని విలేకరుల సమావేశంలో చెప్పడం హాస్యాస్పదమని జనసేన పార్టీ అధ్యక్షుడు సామినేని ఉదయభాను అన్నారు. విజయవాడలోని జనసేన పార్టీ జిల్లా కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ మావిగన్ అంటే రాష్ట్ర ప్రజలకే కాదు, వైసీపీ నేతలకు కూడా అర్థం కావడంలేదని అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ప్రజాప్రతినిధులందరూ ఏకగ్రీవంగా రాష్ట్ర రాజధాని అమరావతి మాత్రమే ఉండాలని శాసనసభలో శాసనమండలిలో కూడా తీర్మానం చేసి పార్లమెంట్ కూడా పంపించారని తెలిపారు.

పార్లమెంట్లో కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి బిల్లు ఆమోదం అవడం రాష్ట్ర ప్రజలందరూ పండుగ వాతావరణంలో ఈ వేడుకలు నిర్వహించడం కూడా జరిగిందన్నారు. మీడియాలో కనబడాలనే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై ఆరోపణలు చేస్తున్న అంబటి రాంబాబు జనసేన పార్టీ అధినేత ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పై లేనిపోని ఆరోపణలు చేస్తేనే, తనను మీడియాలో చూపిస్తారు అనే ఉద్దేశంతో వైసీపీ నేత అంబటి రాంబాబు చేస్తున్న ఆరోపణలను ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు.

పవన్ కళ్యాణ్ నిర్వహిస్తున్న పంచాయితీ రాజ్ శాఖ పనితీరు దేశంలోనే అత్యుత్తమ ప్రతిభ కనబరిచిందని కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన ఘనంగాల్లో స్పష్టమైందని వెల్లడించారు. అడవి బాట పేరుతో గిరిజనులకి మౌలిక సదుపాయాలు కల్పించిన ఏకైక ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ చరిత్రలో నిలిచిపోయారని కొనియాడారు. వైసీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు పంచాయతీరాజ్ శాఖ ఏం ఘనత సాధించిందో అన్న విషయం ప్రజలు చెప్పాలని డిమాండ్ చేశారు.

ఇరిగేషన్ శాఖపై తనకు ఎటువంటి అవగాహన లేదని, వాటర్ డ్రయా ఫ్రమ్ వాల్, క్యూసెకులు, అంటే ఏంటో కూడా తెలియని ఏకైక మాజీ మంత్రి అంబటి రాంబాబు అని ఎద్దేవా చేశారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిపై కావాలనే మాజీ సీఎం జగన్ రెడ్డి విషం చిమ్ముతున్నాడు మాజీ ముఖ్యమంత్రి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇప్పటికన్నా అమరావతిపై ఖచ్చితమైన స్టాండ్ కి ప్రజలకు తెలియజేయాలని డిమాండ్ చేశారు.

వైసీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానులు అంటూ అమరావతి వైజాగ్ కర్నూల్ అని ప్రజల్ని మభ్యపెట్టారు. అధికారం లేకపోయేసరికి మచిలీపట్నం నుంచి మ, విజయవాడ నుండి వి, గుంటూరు నుండి గు, అని తీసుకోవాలని సలహా చెప్పిన వ్యక్తి ఎవరో చెప్పాలని డిమాండ్ చేశారు. మావిగన్ అర్థం ఏంటో కూడా జగన్ రెడ్డికి తెలియదని ఎద్దేవా చేశారు.

ప్రజలను మభ్యపెట్టడానికి మాత్రమే జగన్, బెంగళూరు నుండి తాడేపల్లికి వచ్చి కేవలం విలేకరుల సమావేశాలు పెట్టి, వెళ్ళిపోతున్నారని విమర్శించారు. ప్రతిపక్షం హోదా లేకపోయినా ప్రతిపక్షం హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తాను అని చెప్పిన ఏకైక మాజీ ముఖ్యమంత్రిగా జగన్ చరిత్రలో నిలిచిపోయారని విమర్శించారు. ముందు చూపు లేని ఏకైక మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అని అన్నారు.

Leave a Reply