జనసందోహం కారణంగా తొక్కిసలాట
కరూర్: తమిళగ వెట్రి కళగం (టీవీకే) అధ్యక్షుడు విజయ్ కరూర్‌లో నిర్వహించిన భారీ ర్యాలీ లో విషాదం చోటుచేసుకుంది. ర్యాలీలో జనసందోహం కారణంగా ఏర్పడిన తొక్కిసలాటలో కనీసం ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. ఇంకా పలువురు తీవ్రంగా గాయపడి ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. కొంతమంది అపస్మారక స్థితిలోకి వెళ్లిపోగా, వారిని వెంటనే అంబులెన్స్‌లలో సమీప ఆసుపత్రులకు తరలించారు.
ఈ సంఘటనపై తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కే. స్టాలిన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ, గాయపడిన వారికి అత్యవసర వైద్యసేవలు అందించేందుకు అధికారులను ఆదేశించారు.