కాపురానికి రాక‌పోవ‌డంతో..

కాపురానికి రాక‌పోవ‌డంతో..

జన్నారం, ఆంధ్రప్రభ : భార్య కాపురానికి రావడంలేదని భర్త ఆవేశంతో కత్తెరతో పొడిచి హత్యాయత్నం చేసిన సంఘటన ఇది. మంచిర్యాల జిల్లా(Manchiryala District) జన్నారం మండలంలోని చింతగూడెంకు చెందిన అనితకు జగిత్యాల జిల్లా వెల్కటూర్ మండలంలోని స్తంభంపల్లికి చెందిన సూర అశోక్ కు 2021లో వివాహం జరిగింది.

ఆ తర్వాత భార్య, భర్తలు అన్యోన్యంగా ఉండగా, ఓ కుమారుడు పుట్టాడు. ఆ కుమారునికి ప్రస్తుతం 3 ఏళ్ల వ‌య‌సు ఉంటుంది. ఆ తర్వాత గత రెండు సంవత్సరాల నుంచి భార్య తరచూ గొడవలతో కాపురానికి రాకపోవడంతో భర్త అశోక్(Ashok) ఈ రోజు ఉదయం భార్య కోసం వచ్చి ఇంట్లోనే కత్తెరతో భార్య మెడ భాగంలో పొడిచి హత్యాయత్నంకు పాల్పడ్డాడు.

విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు 108 అంబులెన్స్ ద్వారా చికిత్స నిమిత్తం లక్షెట్టిపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె చికిత్స పొందుతుంది. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు స్థానిక ఎస్సై గొల్లపల్లి అనూష(Gollapally Anusha) సాయంత్రం తెలిపారు.

Leave a Reply