ఎస్‌ఎస్‌ఎంఫీఈ వార్షిక స్పోర్ట్స్ ఉత్సవం
నిర్మల్ జిల్లా, ఖానాపూర్, ఆంధ్రప్రభ : మోడర్న్ ఫిజికల్ ఎడ్యుకేషన్ సంస్థ ఆధ్వర్యంలో ఎస్‌ఎస్‌ఎంఫీఈ మేనేజింగ్ డైరెక్టర్ డా. సుబీర్ ఖాన్ నిర్మల్ జిల్లా ఖానాపూర్ వాసి మార్గదర్శకత్వంలో వార్షిక స్పోర్ట్స్ ఉత్సవ–2025 గ్రేటర్ హైదరాబాద్ నగరంలోని జింఖానా గ్రౌండ్స్‌లో శుక్రవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీఆర్ఎస్ పార్టీ ఖానాపూర్ నియోజకవర్గ ఇన్‌చార్జి భూక్యా జాన్సన్ నాయక్ హాజరయ్యారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ.. విద్యార్థుల్లో క్రీడాస్ఫూర్తిని పెంపొందించాలని, శారీరక దారుఢ్యంతోపాటు మానసిక స్థైర్యం కూడా సమానంగా అభివృద్ధి చెందేలా ప్రతి విద్యార్థి క్రీడల్లో చురుకుగా పాల్గొనాలన్నారు. యువత క్రీడల ద్వారా క్రమశిక్షణ, టీమ్‌వర్క్, నాయకత్వ గుణాలను అలవరచుకోవాలి. భవిష్యత్తులో మన దేశాన్ని ప్రతినిధి చేసే క్రీడాకారులు ఈ విద్యార్థులలో నుంచే పుట్టాలి” అని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మాడ్రన్ ఫిజికల్ ఎడ్యుకేషన్ సంస్థ సభ్యులు పాల్గొన్నారు.