శ్రీలీల బాలీవుడ్ ఎంట్రీ.. ఆ హీరోకు జోడీగా ఛాన్స్ !
టాలీవుడ్ యంగ్ బ్యూటీ శ్రీలీల బాలీవుడ్ ఎంట్రీకి సిద్ధమైంది. అనురాగ్ బసు దర్శకత్వంలో రొమాంటిక్ డ్రామాతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టనుంది మన కిస్సిక్ లేడీ. ఆ సినిమాలో బాలీవుడ్ యంగ్ హీరో కార్తీక్ ఆర్యన్‌కు జంటగా ఛాన్స్ కొట్టేసింది.
తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ ఈరోజు విడుదలైంది. కార్తీక్ ఆర్యన్, శ్రీలీల మధ్య కెమిస్ట్రీ బాగా కుదిరింది. అయితే ఈ రొమాంటిక్ డ్రామా టైటిల్ ఇంకా రివీల్ చేయలేదు. కాగా, ఈ చిత్రాన్ని ఈ ఏడాది దీపావళికి విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది.