kadiam | నమ్మకాన్ని గెలిచిన శ్రీధర్ రావు

kadiam | నమ్మకాన్ని గెలిచిన శ్రీధర్ రావు

  • నాయకత్వం నమ్మింది…ఫలితం చూపించింది.
  • 16, 17, 18 వార్డుల్లో కాంగ్రెస్ ఘన విజయం..

kadiam | స్టేషన్ ఘన్ పూర్, ఆంధ్రప్రభ : స్టేషన్ ఘన్‌పూర్ మున్సిపాలిటీ పరిధిలోని 16, 17, 18 వార్డుల్లో కాంగ్రె స్ అభ్యర్థులను గెలిపించే బాధ్యతలను ఎమ్మెల్యే కడియం శ్రీహరి చిలు పూర్ గుట్ట దేవస్థాన చైర్మన్ పొట్లపల్లి శ్రీధర్ రావుకు అప్పగించారు. తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకోవాలనే సంకల్పంతో శ్రీధర్ రావు ఆ బాధ్యతను అత్యంత సమర్థంగా నిర్వహించి మూడు వార్డుల్లో కాంగ్రెస్ జెండా ఎగరవేశారు.

kadiam

బూత్ స్థాయి నుంచి వార్డ్ స్థాయి వరకు పర్యవేక్షణ:
ప్రచారం ప్రారంభ దశ నుంచే ప్రతి ఇంటి తలుపు తట్టి ఓటర్లను కలు స్తూ, పార్టీ అభ్యర్థుల విజయానికి కావాల్సిన వ్యూహరచన చేశారు. బూత్ స్థాయి నుంచి వార్డ్ స్థాయి వరకు కార్యకర్తలతో సమన్వయం పెంచారు. ఎక్కడా లోపం లేకుండా ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగా రు. పోలింగ్ రోజు కూడా ప్రతి బూత్ వద్ద పర్యవేక్షణ చేస్తూ ఓటర్లను ఉత్సాహపరిచేలా పనిచేశారు. ఫలితాలు వెలువడే వరకు అభ్యర్థులతో పాటు నిలబడి ధైర్యం నింపారు.

కడియం విశ్వాసాన్ని నిలబెట్టిన శ్రీధర్ రావు: :
కడియం శ్రీహరికి అత్యంత విశ్వసనీయుడిగా పేరున్న శ్రీధర్ రావు తన ఉంచిన నమ్మకం వమ్ము కాకూడదనే భావంతో కృషి చేసినట్టు కార్య కర్తలు చెబుతున్నారు. కడియం శ్రీహరి సూచనలు అక్షరాలా అమలు చేస్తూ పార్టీ బలం పెంచడంలో కీలక పాత్ర పోషించారు. మూడు వార్డు ల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించడం ద్వారా కడియం నాయక త్వం పై ఉన్న విశ్వాసం మరింత బలపడింది. మొత్తానికి శ్రీధర్ రావు అంకిత భావం ఈ ఎన్నికల్లో ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టాయి. కడియం శ్రీహరి కి అత్యంత నమ్మకస్తుడిగా ఉంటూ..ఆయన ఆదేశాలను కార్యరూపం లోకి తీసుకెళ్లగల నాయకుడిగా శ్రీధర్ రావు మరోసారి నిరూపించు కున్నారు.

Leave a Reply