- పెవిలియన్ కు క్యూ కట్టిన టాపార్డర్
ఉప్పల్ స్టేడియంలో హైదరాబాద్ తో జరుగుతున్న మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ భారీ లక్ష్యంతో బరిలోకి దిగింది. ఈ క్రమంలో రాజస్థాన్ రాయల్స్‌కు ఆదిలోనే షాక్ తగిలింది.
4.1 ఓవర్లలో 50 పరుగులకే టాపార్డర్ కుప్పకూలింది. ఎస్‌ఆర్‌హెచ్ బౌలర్ సిమర్జీత్ సింగ్ వేసిన రెండో ఓవర్లోనే ఆర్ఆర్ రెండు వికెట్లు కోల్పోయింది. 287 పరుగుల భారీ ఛేజింగ్‌లో ఆర్ఆర్ ఓపెనర్ యశస్వి జైస్వాస్ (1), కెప్టెన్ రియాన్ పరాగ్ (4) పెవిలియన్ చేరారు. 4.1 ఓవర్లలో మహమ్మద్ షమీ బౌలింగ్ లో మరో వికెట్ కోల్పోయింది. ఐదవ ఓవర్ మొదటి బంతికే నితీష్ రాణా (11)ను డగౌట్ కు చేరాడు.
కాగా, సంజు శాంసన్ (33), ధ్రువ్ జురెల్ (22) ప్రస్తుతం క్రీజులో ఉన్నారు. 6 ఓవర్లు ముగిసే సరికి ఆర్ఆర్ స్కోరు 77/3.