- టాస్ గెలిచిన పంజాబ్
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ కీలక పోరుకు సిద్ధమైంది. ఈరోజు ఉప్పల్‌లో జరగనున్న మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్‌తో తలపడనుంది ఎస్‌ఆర్‌హెచ్. హోం గ్రౌండ్ లో జరుగుతున్న ఈ మ్యాచ్ హైదరాబాద్ జట్టుకు కీలకం.
ఇదిలా ఉంటే ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన పంజాబ్.. బ్యాటింగ్ ఎంచుకుంది. దీంతో హోం గ్రౌండ్ లో హైదరాబాద్ జట్టు ముందుగా బౌలింగ్ చేయనుంది.
తుది జట్లు
పంజాబ్ కింగ్స్ : ప్రియాంష్ ఆర్య, ప్రభ్‌సిమ్రాన్ సింగ్ (వికెట్ కీపర్), శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), శశాంక్ సింగ్, నెహాల్ వధేరా, గ్లెన్ మాక్స్‌వెల్, మార్కస్ స్టోయినిస్, మార్కో జాన్సెన్, లాకీ ఫెర్గూసన్, అర్ష్‌దీప్ సింగ్, యుజ్వేంద్ర చాహల్
సన్‌రైజర్స్ హైదరాబాద్ : ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, నితీష్ కుమార్ రెడ్డి, హెన్రిచ్ క్లాసెన్ (వికెట్ కీపర్), అనికేత్ వర్మ, పాట్ కమిన్స్ (కెప్టెన్), హర్షల్ పటేల్, మహమ్మద్ షమీ, జీషన్ అన్సారీ, ఎషాన్ మలింగ
ఈ టోర్నీలో శుభారంభం చేసిన ఆరెంజ్ ఆర్మీ.. అదే జోరును కొనసాగించలేకపోయింది. తొలి మ్యాచ్‌లో రాజస్థాన్‌పై భారీ విజయం సాధించిన ఎస్ఆర్‌హెచ్.. ఆ తర్వాతి మ్యాచ్‌ల్లో చతికిలపడింది. వరుసగా నాలుగు మ్యాచ్‌ల్లో ఓడిపోయి పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచింది.
మరోవైపు, శ్రేయాస్ అయ్యర్ నేతృత్వంలోని పంజాబ్ కింగ్స్ జట్టు పటిష్టంగా రాణిస్తోంది. ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో మూడు విజయాలు సాధించన పంజాబ్.. ఒకే ఒక్క ఓటమితో పాయింట్ల పట్టికలో 5వ స్థానంలో ఉంది. ఆరెంజ్ ఆర్మీ కంబ్యాక్ కోసం పోరాడనుండగా.. పంజాబ్ కింగ్స్ మరో గెలుపు కోసం బరిలోకి దిగనుంది. దీంతో, నేటి మ్యాచ్ హోరాహోరీగా సాగడం ఖాయం అనిపిస్తోంది.
కాగా, ఐపీఎల్ టోర్నీల్లో పంజాబ్ కింగ్స్ – సన్ రైజర్స్ హైదరాబాద్ జట్లు ముఖాముఖి పోరులో 23 మ్యాచ్‌ల్లో తలపడ్డాయి. ఈ 23 మ్యాచ్‌ల్లో పంజాబ్ జట్టు 7 మ్యాచ్‌ల్లో విజయం సాధించగా ఎస్‌ఆర్‌హెచ్ జట్టు 16 సార్లు గెలిచింది. ఈ మ్యాచ్ తోనైనా ఆరెంజ్ ఆర్మీ పునరాగమనం చేస్తుందా లేక పరాజయాల పరంపరను కొనసాగిస్తుందా అనేది చూడాలి.