SRH vs LSG | వ‌రుస వికెట్లు కోల్పోయిన ఆరెంజ్ ఆర్మీ !

  • అనికేత్ వ‌ర్మ, పాట్ కమ్మిన్స్ సిక్సుల వ‌ర్షం

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025లో భాగంగా ఈరోజు హైదరాబాద్‌లో లక్నోతో జరుగుతున్న మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాటింగ్ చేస్తొంది.

కాగా, టాపార్డ‌ర్ అంతా డ‌గౌట్ కు చేరిన వేళ‌.. మిడిలార్డ‌ర్ లో క్రీజులోకి వ‌చ్చి సిక్సుల వ‌ర్షం కురిపించిన అనికేత్ వ‌ర్మ (13 బంతుల్లో 5 సిక్సులుతో 36 ప‌రుగులు) మ‌రో సిక్స్ కి ప్ర‌య‌త్నించి క్యాచ్ ఔట్ గా పెవిలియ‌న్ చేరాడు. ఆ త‌రువా 16.2వ ఓవర్లో అభిన‌వ్ (2) కూడా ఔట‌య్యాడు. 17.3వ ఓవర్లో (4 బంతుల్లో 3 సిక్సులతో 18) చెలరేగిన కెప్టెన్ పాట్ కమ్మిన్స్ క్యాచ్ ఔటయ్యాడు.

అంత‌క‌ముందు నితిష్ కుమార్ రెడ్డి (32) ప‌రుగుల‌కు ఔట‌య్యాడు.

దీంతో 18 ఓవ‌ర్లకు హైద‌రాబాద్ స్కోర్ 180/8.

Leave a Reply