SRH vs DC | ఉప్ప‌ల్‌లో భారీ వ‌ర్షం.. హైద‌రాబ‌ద్ మ్యాచ్ కు అంత‌రాయం

ఉప్ప‌ల్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియం వేదిక‌గా ఢిల్లీతో జరుగుతున్న‌ మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించింది. హైదరాబాద్ అంతటా భారీ వర్షం కురుస్తోంది. ఉప్పల్‌లో కూడా చినుకులుగా ప్రారంభమైన వర్షం… ఢిల్లీ ఇన్నింగ్స్ ముగిసే స‌రికి క్రమంగా పెరిగింది. దీంతో, గ్రౌండ్ సిబ్బంది వెంటనే రంగంలోకి దిగి పిచ్‌ను షీట్లతో కప్పారు.

సన్‌రైజర్స్ హైదరాబాద్ పేసర్లు తమ సొంత గడ్డపై తమ సత్తా చాటారు. ప్లేఆఫ్స్ రేసులో ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటర్ల‌కు చుక్క‌లు చూపించారు. కెప్టెన్ ప్యాట్ క‌మిన్స్ (3/19), జయదేవ్ ఉనద్కట్ (1/13), హ‌ర్ష‌ల్ ప‌టేల్ (1/36), ఈషాన్ మ‌లింగ (1/28) అద‌ర‌గొట్టారు.

కాగా, ఢిల్లీ జ‌ట్టు 62 పరుగుల‌కే 6 వికెట్లు ప‌డిన వేళ ట్రిస్ట‌న్ స్ట‌బ్స్(41 నాటౌట్), అశుతోష్ శ‌ర్మ‌(41)లు అద్భుతంగా ఆడారు. డెత్ ఓవ‌ర్లలో బౌండ‌రీలు రాబ‌ట్టి స్కోర్ 100 దాటించారు. ఏడో వికెట్‌కు 66 ర‌న్స్ జోడించి గౌర‌వ‌ప్ర‌ద‌మైన స్కోర్ అందించారు. వేసిన 20వ ఓవ‌ర్ల్ స్ట‌బ్స్ ఫోర్ బాద‌గా ఢిల్లీ 133 ప‌రుగులు చేయ‌గ‌లిగింది

ట్రిస్టన్ స్టబ్స్ (41 నాటౌట్), అశుతోష్ శర్మ (41) అద్భుతంగా ఆడారు. ఏడో వికెట్‌కు 66 పరుగులు జోడించి… ఢిల్లీ క్యాపిటల్స్ స్కోర్ బోర్డుపై 133 పరుగుల న‌మోదు చేశారు.

Leave a Reply