Sports | రాష్ట్ర స్థాయి వాలీబాల్‌కు ఎంపిక..

Sports | రాష్ట్ర స్థాయి వాలీబాల్‌కు ఎంపిక..

Sports | లక్షేట్టిపేట, ఆంధ్ర ప్రభ : మండలంలోని జెండా వెంకటాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థులు రాష్ట్ర స్థాయి వాలీబాల్ పోటీలకు ఎంపికైనట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు యశోధర ఈ రోజు తెలిపారు.

ఈ నెల 15న లక్షెట్టిపేటలోని జిల్లా పరిషత్ బాలికల పాఠశాలలో నిర్వహించిన అదిలాబాద్ జోనల్ స్థాయి వాలీబాల్ పోటీల(Volleyball competitions)లో పాల్గొని అత్యుత్తమ ప్రదర్శన కనబరిచి ఉమ్మడి అదిలాబాద్ జిల్లా జోనల్ జట్టుకు వినీషా ఆర్య, శ్రీహిత(Vineesha Arya, Srihita)లు ఎంపికయ్యారన్నారు.

ఈనెల 26, 27, 28లలో పెద్దపల్లి జిల్లాలోని ధర్మారం మండలంలోని నంది మేడారంలో జరిగే రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీల్లో పాల్గొంటారని ఆమె వివరించారు. ఎంపికైన వినీషా ఆర్య, శ్రీహితలను ఉపాధ్యాయులు అభినందించారు. ఈ కార్యక్రమంలో శిక్షకుడు బెల్లం శ్రీనివాస్, ఎస్జీఎఫ్ సెక్రటరీ యాకూబ్, ఉపాధ్యాయుల పాల్గొన్నారు.

Leave a Reply