SPORTS Equipment | దరఖాస్తుల ఆహ్వానం

SPORTS Equipment | దరఖాస్తుల ఆహ్వానం
- యువజన సంఘాల నుంచి క్రీడా సామాగ్రికి..
- ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలోని సంఘాలకు అవకాశం
- చివరి తేదీ డిసెంబర్ 31
SPORTS Equipment | వరంగల్, ఆంధ్రప్రభ: భారత ప్రభుత్వ యువజన వ్యవహారాల అండ్ క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ‘మేరా యువ భారత్’ (MY Bharat) కేంద్రం, 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను క్రీడా సామాగ్రి పంపిణీకి శ్రీకారం చుట్టింది. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఆరు జిల్లాల (వరంగల్, హనుమకొండ, జనగాం, భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్) యువజన సంఘాల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు మేరా యువ భారత్ ఉమ్మడి జిల్లా డిప్యూటీ డైరెక్టర్ చింతల అన్వేష్ ఇవాళ తెలిపారు.
దరఖాస్తుకు కావాల్సిన అర్హతలు & పత్రాలు :
రిజిస్ట్రేషన్:
మై భారత్ (MY Bharat) వెబ్‌సైట్‌లో రిజిస్టర్ అయిన యువజన సంఘాలు, మహిళా మండలిలు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.
జతపరచాల్సినవి:
వెబ్‌సైట్ రిజిస్ట్రేషన్ జిరాక్స్, సంఘం యొక్క బైలాస్ (By-laws) కాపీ.
కార్యక్రమాల వివరాలు:
గతంలో సదరు సంఘం నిర్వహించిన సామాజిక, క్రీడా కార్యక్రమాల పత్రికా క్లిప్పింగులు, ఫొటోలను జత చేయాలి.
గడువు తేదీ:
ఆసక్తి గల సంఘాలు తమ దరఖాస్తులను ఈ నెల 31వ తేదీ లోపు మేరా యువ భారత్ కేంద్ర కార్యాలయంలో అందజేయాలని ఆయన సూచించారు. వచ్చిన దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరం అర్హత గల సంఘాలకు క్రీడా సామాగ్రిని అందజేస్తామని తెలిపారు.
సంప్రదించాల్సిన ఫోన్ నంబర్:
మరిన్ని వివరాల కోసం వరంగల్‌లోని మేరా యువ భారత్ కేంద్రం కార్యాలయంలో నేరుగా గానీ లేదా 0870-2958776 ఫోన్ నంబర్‌కు ఫోన్ చేసి వివరాలు తెలుసుకోవచ్చని పేర్కొన్నారు.
