క్రీడలు మానసిక ఉల్లాసానికి దోహదపడతాయి…

ఊట్కూర్, ఆంధ్రప్రభ : క్రీడలు ప్రతినిత్యం ఆడడంవల్ల శారీరక దృఢత్వంతోపాటు మానసిక ఉల్లాసానికి ఎంతగానో దోహదపడతాయని బిజ్వార్ ఉపసర్పంచ్ గోవర్ధన్ రెడ్డి అన్నారు. శుక్రవారం నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండల పరిధిలోని బిజ్వార్ లో ప్రీమియం లీగ్ క్రికెట్ పోటీల్లో గెలుపొందిన విజేతలకు బహుమతులుప్రధానంచేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యువకులు, విద్యార్థులు చదువుతోపాటు క్రీడారంగంలో రాణించడం వల్ల ఉజ్వల భవిష్యత్తు ఉంటుందనిఅన్నారు.
క్రీడలు ఆడడంవల్ల సంపూర్ణ ఆరోగ్యవంతం తో పాటు స్నేహభావం పెంపొందుతుందని క్రీడారంగంలో రాణించి గ్రామానికి మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలన్నారు. ఉగాది పర్వదినం పురస్కరించుకొని నిర్వహించిన ప్రీమియంలీగ్ క్రికెట్ పోటీల్లో ప్రథమ బహుమతి రవీందర్ రెడ్డి, ద్వితీయ బహుమతి నితిన్ గౌడ్ టీం సభ్యులు గెలుపొందినట్లు తెలిపారు. గెలుపొందిన విద్యార్థులకు నగదుతోపాటు బహుమతులుఅందజేసి సన్మానించి అభినందించారు. ఈ కార్యక్రమంలో యువకులు సిద్దు. గోపి. గోపాల్ రెడ్డి,ఉపేందర్ రెడ్డి భరత్, పి రాము, అశోక్,దొర లక్ష్మణ్, తదితరులుపాల్గొన్నారు.
