విజయదశమి ప్రత్యేక పూజలు

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ ప్రతినిధి : న్యూఢిల్లీ (New Delhi) లోని తెలంగాణ భ‌వ‌న్‌లో విజ‌య‌ద‌శ‌మి ఉత్స‌వాలు ఘ‌నంగా నిర్వ‌హించారు. భ‌వ‌న్‌లో ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హించి, అనంత‌రం వాహ‌న పూజ‌లు కూడా చేశారు. ఈ కార్య‌క్ర‌మంలో తెలంగాణ భవన్ (Telangana Bhavan) రెసిడెంట్ కమిషనర్ శశాంక్ గోయల్, తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సమన్వయం) డా. గౌరవ్ ఉప్పల్ , డిప్యూటీ కమిషనర్ సంగీత, ఆర్ అండ్ బీ విభాగం డిప్యూటీ ఇంజనీర్ అంబేద్కర్, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply