Special program | పాలకులు మారినా.. సీమ రాత మారదా?

Special program | పాలకులు మారినా.. సీమ రాత మారదా?
- పెండింగ్ ప్రాజెక్టులపై కమ్యూనిస్టుల ధ్వజం
- సీపీఐ రాష్ట్ర కార్యదర్శి…రామాంజనేయులు
Special program | నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ : రాయలసీమలోని సాగునీరు, త్రాగునీటి ప్రాజెక్టులను గాలికొదిలేసి, ప్రజలను వంచిస్తున్న పాలకుల తీరుపై ఎర్రజెండా కదనరంగంలోకి దూకిందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామాంజనేయులు ఈ రోజు పేర్కొన్నారు. సీపీఐ 100 సంవత్సరాల శత జయంతి ఉత్సవాల సందర్భంగా గాంధీ చౌక్ లో ప్రత్యేక కార్యక్రమాన్ని జిల్లా కార్యదర్శి రంగనాయుడు, ప్రసాద్, బాబా ఫక్రుద్దీన్ ల అధ్యక్షతన చేపట్టారు.
వారు మాట్లాడుతూ… కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దేశ భవిష్యత్తును కార్పొరేట్లకు తాకట్టు పెడుతోందని విమర్శించారు. 12 ఏళ్ల మోదీ పాలనలో దేశానికి ఒరిగిందేమీ లేదన్నారు. ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాల హామీ ఎక్కడికి పోయింది? ప్రతి కుటుంబానికి ఇస్తానన్న రూ. 15 లక్షలు ఏమయ్యాయి?” అని ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లవుతున్నా సీమ ప్రాజెక్టుల విషయంలో స్పష్టత లేదన్నారు.
నంద్యాల గడ్డపై మంత్రి ఫరూక్‌ను గెలిపించడం అంటే మోదీ అప్రజాస్వామిక పాలనకు ఊపిరి పోయడమేనని విమర్శించారు. అడవుల్లోని సంపదను కార్పొరేట్లకు అప్పగించే కుట్రలను ప్రజలు తిప్పికొట్టాలని, ఎర్రజెండా ఎప్పుడూ పీడిత ప్రజల పక్షానే ఉంటుందని స్పష్టం చేశారు. సమావేశంలో నాగ రాముడు, మురళీధర్ ,సుబ్బారెడ్డి, సోమన్న, భార్గవ్, సంజీవులు ,హరినాథ్, లక్ష్మీదేవి, భూమని, శ్రీనివాసులు, ధనుంజయుడు, సుశీలమ్మ, శివయ్య నాగరాజు, వాసు తో పాటు సీపీఐ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
