Medaram | మంత్రుల ప్ర‌త్యేక పూజలు

అమ్మవార్లకు ప్రత్యేక పూజలు


ఆంధ్రప్రభ ప్రతినిధి, ములుగు : ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతరైన మేడారానికి (Medaram) రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Ponguleti Srinivas Reddy), రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క (Seethakka), ఎస్సీ, ఎస్టీ, గిరిజన సంక్షేమ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ (Adluri Laxman Kumar), మహబూబాబాద్ ఎంపీ బలరాం నాయక్ లు చేరుకున్నారు.

వీరికి కలెక్టర్ (Collector) దివాకర టీఎస్, ఎస్పీ డాక్టర్ శబరిష్, ఐటీడీఏ పీవో చిత్ర మిశ్రా, డీఎఫ్ఓ రాహుల్ కిషన్ జాదవ్ లు పూల మొక్కలు అందించి స్వాగతం పలికారు. అనంతరం అమ్మవార్ల గద్దెలను చేరుకొని తల్లులకు పసుపు, కుంకుమ, పూలు, చీరె సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించి, మొక్కులు చెల్లించుకున్నారు.

Leave a Reply