చలివేంద్రాన్ని ప్రారంభించిన ప్రత్యేక అధికారి ఎంఈవో

భీమ్‌గల్‌ రూరల్, ఆంధ్రప్రభ : భీమ్‌గల్‌ మండలంలోని బాబాపూర్ గ్రామంలో గ్రామ సర్పంచ్ ఎంఏ. సమీర్, ఉపసర్పంచ్ మంద గోవర్ధన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ముఖ్యఅతిథిగా హాజరైన స్పెషల్ ఆఫీసర్ మండల విద్యాశాఖ అధికారి డి.స్వామి, సర్పంచ్ శుక్రవారం రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు.

ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ మాట్లాడుతూ.. గ్రామానికి వచ్చి ప్రజలకు వేసవికాలంలో ఎండలు ఎక్కువ కొట్టడం వలన ప్రజలకు నీటి బాధ లేకుండా నీళ్లు లేక ఇబ్బంది పడుతున్నారని ముందస్తు ఆలోచనతో ఈ చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు.ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి ప్రశాంత్, ప్రాథమిక పాఠశాల హెడ్మాస్టర్ ఎడ్ల శేఖర్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ చిన్ని రెడ్డి, నాయకులు, వార్డు సభ్యులు, స్థానిక నాయకులు, యువకులు పాల్గొన్నారు.

Leave a Reply