ఇబ్రహీంపట్నం సీఐగా సుబ్రహ్మణ్యం

ఇబ్రహీంపట్నం సీఐగా సుబ్రహ్మణ్యం
- ట్రాఫిక్ సీఐగా డి.చంద్రశేఖర్
ఇబ్రహీంపట్నం, ఆంధ్రప్రభ : ఇబ్రహీంపట్నం సర్కిల్ ఇన్ స్పెక్టర్ గా ఎ.సుబ్రహ్మణ్యం నియమితులయ్యారు. ఈ మేరకు ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ ఎస్.వి.రాజశేఖర్ బాబు ఆదివారం ఆదేశాలు జారీ చేశారు. సిటీ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ సీఐగా పనిచేస్తున్న సుబ్రహ్మణ్యం ఇక్కడికి బదిలీపై వస్తున్నారు.
ఇబ్రహీంపట్నం సీఐ ఎ.చంద్రశేఖర్ విజయవాడ స్పెషల్ బ్రాంచి సీఐగా బదిలీ అయ్యారు. ఇబ్రహీంపట్నం ట్రాఫిక్ సీఐగా డి.చంద్రశేఖర్ నియమితులయ్యారు. మైలవరం సీఐగా పనిచేస్తున్న ఈయన ఇక్కడికి బదిలీపై వస్తున్నారు. విజయవాడ మూడవ పట్టణ ట్రాఫిక్ సీఐ కె.కిషోర్ బాబు మైలవరం సీఐగా బదిలీ అయ్యారు.
