SP Sarath Chandra | ట్రాఫిక్ నిబంధ‌న‌లు పాటించాలి

SP Sarath Chandra | ట్రాఫిక్ నిబంధ‌న‌లు పాటించాలి

  • నల్గొండలో స్పెషల్ డ్రైవ్

SP Sarath Chandra | నల్గొండ, ఆంధ్రప్రభ : జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఆదేశాల మేరకు ఇవాళ నల్గొండ పట్టణంలో టూటౌన్ ఎస్సై సైదులు ఆధ్వర్యంలో హైదరాబాద్ రోడ్డులో స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. పట్టణ పరిధిలో ఎవరు ఎటువంటి ట్రాఫిక్ నియమ నిబంధనలు పాటించకుండా ద్విచక్ర వాహనాలు అస్తవ్యస్తంగా నడిపి ప్రమాదాలకు గురవుతున్నారని, ట్రాఫిక్ నిబంధనలను పాటించని వారిపై చర్యలు తీసుకుంటూ అవగాహన కల్పించాలని ఎస్పీ ఆదేశించారు. ఈ మేరకు స్పెష‌ల్ డ్రైవ్ నిర్వహించడం జరిగిందని టూటౌన్ సీఐ రాఘవరావు తెలిపారు.

ఎవరైతే ట్రిపుల్ రైడింగ్ అదేవిధంగా సెల్ ఫోన్ డ్రైవింగ్, మైనర్ డ్రైవింగ్, వితౌట్ నెంబర్ ప్లేట్స్, ఎక్కువ శబ్దాలు వచ్చే విధంగా మన సైలెన్సర్ ఫిట్టింగ్ చేసి ఎక్కువ శబ్దాలు నిర్వహించే వారిపై హైద‌రాబాద్ రోడ్‌లోని ప్రసాద్ ఉడిపి హోటల్ వద్ద టూటౌన్ ఎస్ఐలు. సిబ్బంది కలిసి స్పెషల్ డ్రైవ్ నిర్వహించడం జరిగిందన్నారు. ఇందులో సుమారు 20 మోటారు వెహికల్స్‌ను డిటెండ్ చేసి ఫైన్లు వేశామని తెలిపారు. ట్రాఫిక్ నిబంధనలు అందరూ పాటించాలని కోరారు. మైనర్లకు బైకులు ఇవ్వొద్ద‌ని తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు. పోలీస్ శాఖ కఠినంగా హెచ్చరిక జారీ చేస్తున్నామని తెలిపారు. ఈ నిబంధనలు పాటించని వారికి వెహికిల్ సీజ్ చేసి తగిన చ‌ర్య‌లు తీసుకుంటామని తెలిపారు.

Leave a Reply