SP | అప్రమత్తంగా ఉండాలి..

SP | అప్రమత్తంగా ఉండాలి..
పోలింగ్ సరళిని పరిశీలించిన ఎస్పీ
SP | మల్హర్, ఆంధ్రప్రభ : మూడో విడత ఎన్నికల సందర్భంగా తాడిచెర్ల గ్రామపంచాయతీని భూపాలపల్లి జిల్లా ఎస్పీ (SP) సిరిశెట్టి సంకీర్త్ మల్హర్ రావు సందర్శించారు. అక్కడి పోలింగ్ సరళి, బందోబస్తు ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రజలు ఎలాంటి భయభ్రాంతులకు లోనుకాకుండా స్వేచ్ఛగా, ప్రశాంత వాతావరణంలో తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని తెలిపారు. అలాగే విధులు నిర్వహిస్తున్న పోలీస్ అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని, ఎన్నికలు శాంతియుతంగా జరిగేలా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా పోలింగ్ కేంద్రంలో ఓటు వేయడానికి వచ్చిన వృద్ధురాలితో ఎస్పీ ఆప్యాయంగా మాట్లాడారు.
