సౌందర్య లహరి

74. . వహత్యంబస్తంబేరమదనుజ కుంభ ప్రకృతిభిః
సమారబ్ధాంముక్తామణిభిరమలాంహారలతికామ్
కుచాభోగోబింబాధరరుచిభిరన్తశ్శబలతాం
ప్రతాప వ్యామిశ్రాంపురదమయితుః కీర్తి మివ తే.

తాత్పర్యం: అమ్మా! జగన్మాతా! విశాలంగా ఉన్న నీమెడ నుండి కుచముల వరకు ఉండే భాగం మంచిముత్యాలహారంతోఅందగిస్తున్నది. ఆ స్వచ్చమైన, దోషరహితమైన ముత్యాలుగజాసురుడి కుంభస్థలము నుండి పుట్టినవి. అమ్మవారి దొండపండు వంటి క్రింది పెదవికి ఉన్న ఎఱ్ఱనికాంతి ఆ ముత్యాల మీద ప్రతిఫలించి, వాటిలో చిత్రవర్ణాలు కలుగుతున్నాయి. ఆ ఎఱ్ఱని చిత్రవర్ణాలు త్రిపురహరుడైన శివుడి ప్రతాపాన్ని, కీర్తిని పొందటం వల్ల కలిగినట్టు అనిపిస్తున్నది.

  • డాక్ట‌ర్ అనంత‌ల‌క్ష్మి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *