సౌందర్య లహరి

59. స్ఫురద్గండాభోగ ప్రతిఫలిత తాటంక యుగళం
చతుశ్చక్రమ్మన్యే తవ ముఖ మిదంమన్మథ రథం
యమారుహ్యదృహ్యత్యవనిరథమర్కేందు చరణం
మహావీరోమారఃప్రమథపతయేసజ్జితవతే.

తాత్పర్యం: జగదంబా! నిర్మలమైన కాంతితో అద్దంలాగా మెరిసిపోయే నీ చెక్కిళ్ళ మీద ప్రతిఫలించిన నీ రెండు చెవుల తాటంకాల ప్రతిబింబాలు కలిగిన ముఖము నాలుగు చక్రాల రథం లాగా అనిపిస్తోంది. దానిని అధిరోహించి మన్మథుడు – భూదేవిని రథంగాను, సూర్యచంద్రులను చక్రాలుగాను చేసుకుని ఎక్కి, మహావీరుడిలాగా యుద్ధసన్నద్ధుడై వచ్చిన ప్రమథగణపతి,త్రిపురహరుడు అయిన శివుని ఎదుర్కొన గలుగుతున్నాడు.

  • డాక్ట‌ర్ అనంత‌ల‌క్ష్మి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *