సౌందర్య లహరి

55.నిమేషోన్మేషాభ్యాం ప్రళయ ముదయంయాతి జగతీ
తవేత్యాహుస్సంతోధరణిధరరాజన్య తనయే
తదున్మేషాజ్ఞాతంజగదిదమశేషంప్రళయతః
పరిత్రాతుం శంకే పరిహృతనిమేషా స్తవ దృశః

తాత్పర్యం: పర్వతరాజపుత్రీ! నీ కనురెప్పలు తెరచుకోవటం వల్ల జగత్తుకి సృష్టి, మూసుకోవటం వల్ల లయం జరుగుతాయని పెద్దలు చెప్పిన మాట. నీ కనురెప్పలు తెరచినందు వల్ల ఉద్భవించిన సృష్టిని కాపాడే నిమిత్తం నీ కన్నులు రెప్పపాటుని త్యజించాయి. ఆ కారణం చేత రెప్పపాటు లేక నీ కన్నులు ఎప్పుడు తెరచుకొనే ఉంటాయి.

  • డాక్ట‌ర్ అనంత‌ల‌క్ష్మి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *