Sonia Gandhi | సోనియాగాంధీకి అస్వస్థత..

సీనియర్ కాంగ్రెస్ నాయకురాలు సోనియా గాంధీ శనివారం (జూన్ 7) స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. ఆమె ప్రస్తుతం హిమాచల్ ప్రదేశ్‌లోని సిమ్లాలో తన కుమార్తె ప్రియాంక గాంధీ (Priyanka Gandhi) నివాసంలో ఉన్నారు. ఆరోగ్య సమస్యలు తలెత్తడంతో ఆమెను సిమ్లాలోని ఇందిరా గాంధీ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ (IGMC)కు తరలించారు.

ఆసుపత్రిలో వైద్యులు ECG, MRI వంటి పరీక్షలు నిర్వహించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.

ఈ సంఘటన నేపథ్యంలో, హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సుఖు (CM Sukhwinder Singh Sukhu) తన ఉనా పర్యటనను రద్దు చేసి సిమ్లాకు చేరుకున్నారు. ఆసుపత్రి వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. సోనియా గాంధీ త్వరగా కోలుకోవాలని కాంగ్రెస్ కార్యకర్తలు, అభిమానులు ప్రార్థనలు చేస్తున్నారు.

Leave a Reply