Nellore | తండ్రి చేతిలో కొడుకు హతం

Nellore | తండ్రి చేతిలో కొడుకు హతం

Nellore | (నెల్లూరు , ఆంధ్రప్రభ ప్రతినిధి) : సాక్షాత్తు కన్న తండ్రి చేతిలోనే కుమారుడు హత్యకు గురైన దుర్ఘటన శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు (Nellore) జిల్లా ఆత్మకూరు మండలం బట్టేపాడులో సోమవారం ఉదయం చోటు చేసుకుంది. వివరాల మేరకు సోమవారం ప్రభుత్వం ఫించన్లను పంపిణీ చేస్తోంది. ఇందులో భాగంగా ఆత్మకూరు మండలం బట్టేపాడు గ్రామం లో నివాసం ఉంటున్న మాముడూరు పుల్లయ్యకు కూడా అధికారులు ఫించన్ అందచేసారు. ఆయన కుమారుడు మాముడూరు మస్తానయ్య(33) తండ్రి వద్దకు చేరుకుని ఆ ఫించన్ నగదును తనకివ్వాలని కోరాడు. అందుకు పుల్లయ్య తిరస్కరించడంతో వివాదం ప్రారంభం అయ్యింది. మాటా మాటా పెరిగి ఇద్దరూ కొట్టుకునేందుకుకు సిద్దమయ్యారు. ఈ పరిస్థితుల్లో ఆవేశంలో విచక్షణ మరిచిన తండ్రి పుల్లయ్య సమీపంలో ఉన్న వస్తువుతో కొడుకు మస్తానయ్య తలపై మోదడంతో తీవ్రగాయంతో రక్తస్రావమై అతను అక్కడికక్కడే మృతి చెందాడు. దీంతో సమాచారం అందుకున్న ఆత్మకూరు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని నిందితుడు పుల్లయ్యను అదుపులోకి తీసుకున్నారు. మృత దేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఆత్మకూరు ఏరియా ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

Leave a Reply