Solution | గెలిపిస్తే స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రిస్తా..

Solution | గెలిపిస్తే స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రిస్తా..

  • నిత్యం అందుబాటులో ఉంటూ ప్ర‌జాసేవ చేస్తా
  • అక్కాపూర్ గ్రామ సర్పంచ్ అభ్యర్థి బోండ్ల శ్రీవాణి గంగయ్య

Solution | నిర్మల్ రూరల్, ఆంధ్రప్రభ : త‌న‌ను గెలిపిస్తే అక్కాపూర్ గ్రామ అభివృద్ధి కృషి చేస్తాన‌ని, స‌మ‌స్యలు ప‌రిష్క‌రిస్తాన‌ని స‌ర్పంచ్ అభ్య‌ర్థి బోండ్ల శ్రీవాణి గంగయ్య హామీ ఇచ్చారు. ఈ రోజు అక్కాపూర్ గ్రామంలో ఇంటింటి ప్రచారాన్ని చేపట్టారు. గ్రామంలో నెలకొన్న సమస్యలను తాను పదవి చేపట్టిన మూడు నెలల్లోనే పరిష్కారం(solution) చూపుతానన్నారు.

డ్రైనేజీ, సీసీ రోడ్ల సమస్యలను పరిష్కరించేందుకు మొదటి ప్రాధాన్య‌త‌ ఇస్తానని హామీ ఇచ్చారు. 24 గంటలు ప్రజలకు అందుబాటులో ఉంటానని అన్నారు. ప్రజలు మరోసారి అవకాశం ఇస్తే గ్రామాల్లోని మౌలిక వసతుల కల్పనకు దశలవారీగా కృషి చేస్తాన‌ని తెలిపారు. ఆమె తోపాటు మద్దతుదారులు పెద్ద సంఖ్యలో ప్రచారం(promotion)లో పాల్గొన్నారు.

Leave a Reply