W – IND vs SA | టీమిండియా సాలిడ్ స్కోర్!

భారత్ మహిళా జట్టు బ్యాటర్లు మరోసారి దుమ్మురేపారు. స‌ఫారీల‌తో జ‌రుగుతున్న తుది పోరులో… ఇన్నింగ్స్ మొత్తం మీద అద్భుతమైన భాగస్వామ్యాలు కట్టిపడేశాయి. 50 ఓవర్లలో టీమిండియా 7 వికెట్ల నష్టానికి 298 పరుగులు రాబట్టింది.

ఇన్నింగ్స్ ఆరంభంలోనే ఓపెనర్లు స్మృతి మంధానా, షఫాలీ వర్మా జట్టు కోసం దృఢమైన పునాది వేశారు. ఈ జంట మొదటి వికెట్‌కి 104 పరుగుల విలువైన భాగస్వామ్యం అందించింది. స్మృతి 45 పరుగులు (58 బంతుల్లో) సాధించగా, షఫాలీ 87 పరుగుల హాఫ్ సెంచ‌రీతో మెరిసింది.

తర్వాత క్రీజులోకి వచ్చిన జెమీమా రోడ్రిగ్స్ కూడా మంచి మద్దతు అందించింది. షఫాలీతో కలిసి 2వ వికెట్‌కి 62 పరుగులు జోడించింది. జెమీమా 24 పరుగులు (37 బంతుల్లో) సాధించింది.

కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (20 పరుగులు, 29 బంతులు) – దీప్తి శర్మా (58 పరుగులు, 58 బంతులు) మధ్య నాలుగో వికెట్‌కి 52 పరుగుల భాగస్వామ్యం చోటుచేసుకుంది. దీప్తి ఆత్మవిశ్వాసంగా ఆడుతూ జట్టును 250 పరుగుల దిశగా నడిపింది.

అమన్‌జోత్ కౌర్ 12 (14 బంతులు)తో సహకరించగా, వికెట్‌కీపర్ రిచా ఘోష్ 34 పరుగులు (24 బంతులు)తో ఆకట్టుకుంది. దీప్తి – రిచా జంటగా 6వ వికెట్‌కి 47 పరుగులు సాధించారు. చివర్లో రాధా యాదవ్ 3 నాటౌట్‌గా నిలిచింది.

బౌలర్లలో సౌతాఫ్రికా తరఫున అయాబోంగా ఖాకా (58/3) అత్యుత్తమ ప్రదర్శన కనబరిచింది. నోంకులులెకో మ్లాబా 47/1, నాడీన్ డి క్లెర్క్ 52/1, క్లోయ్ ట్రయాన్ 46/1 వికెట్లు తీశారు. ఇప్పుడు సౌతాఫ్రికా 299 పరుగుల లక్ష్యం తో ఛేజింగ్ ప్రారంభించ‌నుంది.

Leave a Reply